ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: జీవీకే-ఏఐటీఏ జాతీయ సీనియర్ టెన్నిస్ టోర్నీలో 45+ పురుషుల సింగిల్స్‌లో సి.వి.ఆనంద్ శుభారంభం చేశారు. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో మంగళవారం జరిగిన 45+ పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 6-1, 6-0 స్కోరుతో అవలీలగా డి.ఎస్.రాజుపై విజయం సాధించి రెండో రౌండ్‌కి చేరారు. తొలి రౌండ్ ఇతర మ్యాచ్‌ల్లో కె.మహారా ప్రకాష్ 6-3, 6-2తో మునికృష్ణరెడ్డిపై, ఎస్.నరేంద్రనాథ్ 6-1, 6-0తో బి.జోజిరెడ్డిపై, పాల్ మనోహర్ 6-4, 6-4తో సూర్యప్రకాష్‌పై, బి.జి.నాగేష్ 6-3, 6-2తో బి.వి.ఆనంద్‌పై, జయంత్ పవార్ 6-3, 6-3తో ఎ.ఎస్.ఖాన్‌పై, జి.చంద్రబాబు 6-3, 5-7, 6-3తోజి.అప్పలరాజుపై గెలిచారు. ఈ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వట్టి వసంతకుమార్ లాంఛనంగా ప్రారంభించారు.
తొలి రౌండ్ ఫలితాలు: 55+ పురుషుల సింగిల్స్: ఆర్.ఇ.సుదర్శన్ 6-0, 6-0తో వై.ప్రసాద్‌పై, మహ్మద్ అజాముల్లా 7-5, 6-2తో మన్మథ రావుపై, ఎ.భాస్కర్‌రెడ్డి 7-5, 6-2తో ఎం.ఎస్.ప్రసాద్‌పై, ఎం.నరేష్ 6-2, 6-0తో ఎన్.సుధాకర్‌రెడ్డిపై, కె.రాధాకృష్ణ మూర్తి 6-0, 6-4తో సత్యనారాయణపై, ఎ.ఆర్.రావు 6-3, 7-5తో పి.కె.పట్నాయక్‌పై, డాక్టర్ రామ్మోహన్ రావు 6-2, 6-1తో బి.జి.రెడ్డిపై, ఎస్.సేతు 6-3, 6-1తో రవి నగర్కర్‌పై గెలిచారు.
సి.వి.ఆనంద్ శుభారంభం
Published Wed, Dec 11 2013 12:31 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM
Advertisement
Advertisement