సాక్షి, హైదరాబాద్: ఆసియా జూనియర్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి అమినేని శివాని సత్తాచాటింది. బాలికల సింగిల్స్, డబుల్స్‌లో ఆమె టైటిల్ పోరుకు అర్హత సంపాదించింది. సింగిల్స్‌లో షేక్ హుమేరా బేగంతో అమీతుమీ తేల్చుకోనుంది. బాలుర సింగిల్స్‌లో యెడ్ల కుశాల్, హిమాన్షు మోర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు.
లియోనియా రిసార్ట్స్‌లోని ఇండోర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో గురువారం జరిగిన అండర్-14 బాలికల సెమీఫైనల్లో మూడో సీడ్ అమినేని శివాని 6-1, 6-3తో రెండో సీడ్ మహక్ జైన్‌పై అలవోక విజయం సాధించింది. రెండో సెమీస్‌లో షేక్ హుమేర 6-4, 6-3తో స్వాతిశ్రీ సురేశ్‌పై గెలుపొందింది. బాలుర సెమీస్‌లో క్వాలిఫయర్ కుశాల్ 6-3, 6-0తో ఆరో సీడ్ నీల్ గరుద్‌పై సునాయాస విజయం సాధించాడు. రెండో సెమీఫైనల్లో రెండో సీడ్ హిమాన్షు మోర్ 6-7 (3/7), 6-1, 6-2తో తీర్థ శశాంక్‌పై గెలిచాడు.
బాలికల డబుల్స్ విభాగంలో సాయిదేదీప్య-మహక్ జైన్ జోడి ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో దేదీప్య జంట 6-4, 6-3తో నేహ-స్వాతిశ్రీ ద్వయంపై, రెండో సీడ్ శివాని-శ్రావ్య జోడి 6-1, 6-1తో మూడో సీడ్ పాన్యభల్లా-శ్రీవల్లి రష్మిక జంటపై విజయం సాధించాయి. బాలుర డబుల్స్ సెమీఫైనల్లో రిత్విక్ చౌదరి-సచిత్ శర్మ జోడి 6-4, 7-6 (7/3)తో శ్రీవత్స రాతకొండ-హిమాన్షు మోర్ ద్వయంపై, రోహన్ రెడ్డి-తీర్థ శశాంక్ ద్వయం 6-4, 6-2తో నీల్ గరుద్-మొహమ్మద్ అతిఫ్ షేక్ జంటపై గెలుపొందాయి. శుక్రవారం సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్ మ్యాచ్ జరుగుతాయి.
ఫైనల్లో శివాని, హుమేర
Published Fri, Aug 8 2014 12:55 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement