థాయ్‌లాండ్ చేతిలో భారత్ ఓటమి | India's defeat at the hands of Thailand | Sakshi
Sakshi News home page

థాయ్‌లాండ్ చేతిలో భారత్ ఓటమి

Published Wed, May 7 2014 11:45 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

India's defeat at the hands of Thailand

ఆసియా ఓషియానియా టెన్నిస్
 సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓషియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత్ వరుస విజయాలకు బ్రేక్‌పడింది. థాయ్‌లాండ్ 2-1తో భారత్‌ను ఓడించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల సింగిల్స్‌లో గెలిచినా డబుల్స్‌లో ఓడటంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. మలేసియాలోని కూచింగ్‌లో బుధవారం జరిగిన తొలి సింగిల్స్‌లో కర్మాన్ కౌర్ తాండి 3-6, 6-2, 6-7 (2/7)తో మనితా బుత్సరకోమ్‌విసిత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది.
 
  భారత్ 0-1తో వెనుకబడిన దశలో రెండో సింగిల్స్ బరిలోకి దిగిన ప్రాంజల 6-2, 6-4తో బున్యవి తంచైవత్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. దీంతో 1-1తో స్కోరు సమం కాగా నిర్ణాయక డబుల్స్‌లో ప్రాంజల-కర్మాన్ కౌర్ జంట 6-3, 2-6, 5-7తో పిచయతిదా జాండేంగ్- బున్యవి తంచైవత్ (థాయ్‌లాండ్) జోడి చేతిలో కంగుతింది. న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లపై క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌ను థాయ్‌లాండ్ ఓడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement