prajavala
-
థాయ్‌లాండ్ చేతిలో భారత్ ఓటమి
ఆసియా ఓషియానియా టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓషియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత్ వరుస విజయాలకు బ్రేక్‌పడింది. థాయ్‌లాండ్ 2-1తో భారత్‌ను ఓడించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల మహిళల సింగిల్స్‌లో గెలిచినా డబుల్స్‌లో ఓడటంతో భారత్‌కు పరాజయం తప్పలేదు. మలేసియాలోని కూచింగ్‌లో బుధవారం జరిగిన తొలి సింగిల్స్‌లో కర్మాన్ కౌర్ తాండి 3-6, 6-2, 6-7 (2/7)తో మనితా బుత్సరకోమ్విసిత్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. భారత్ 0-1తో వెనుకబడిన దశలో రెండో సింగిల్స్ బరిలోకి దిగిన ప్రాంజల 6-2, 6-4తో బున్యవి తంచైవత్ (థాయ్‌లాండ్)పై గెలిచింది. దీంతో 1-1తో స్కోరు సమం కాగా నిర్ణాయక డబుల్స్‌లో ప్రాంజల-కర్మాన్ కౌర్ జంట 6-3, 2-6, 5-7తో పిచయతిదా జాండేంగ్- బున్యవి తంచైవత్ (థాయ్‌లాండ్) జోడి చేతిలో కంగుతింది. న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్‌లపై క్లీన్‌స్వీప్ చేసిన భారత్‌ను థాయ్‌లాండ్ ఓడించింది. -
ఫిలిప్పీన్స్ పై భారత్ గెలుపు
రెండు విభాగాల్లో నెగ్గిన ప్రాంజల సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓిషియానియా చివరి క్వాలిఫయింగ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల హవా కొనసాగుతోంది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆమె సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఘనవిజయం సాధించింది. దీంతో భారత్ 3-0తో ఫిలిప్పీన్స్‌పై కూడా క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం కివీస్‌నూ 3-0తో ఓడించిన సంగతి తెలిసిందే. మలేసియాలోని కూచింగ్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మంగళవారం జరిగిన పోరులో తొలుత సింగిల్స్‌లో ప్రాంజల 6-2, 6-3తో బెర్నాడెట్టె బేల్స్ (ఫిలిప్పీన్స్)పై గెలుపొందగా, రెండో సింగిల్స్‌లో కర్మాన్ కౌర్ తాండి 5-7, 6-2, 6-0తో కిమ్ ఇగ్లూపాస్ (ఫిలిప్పీన్స్)పై నెగ్గింది. చివరగా జరిగిన మహిళల డబుల్స్‌లో ప్రాంజల-కర్మాన్ కౌర్ జోడి 6-1, 6-3తో కిమ్ ఇగ్లూపాస్-డొమినిక్వె ఓంగ్ (ఫిలిప్పీన్స్) జంటపై అలవోక విజయం సాధించింది. బుధవారం జరిగే పోరులో భారత్... థాయ్‌లాండ్‌తో తలపడుతుంది.