ఫిలిప్పీన్స్‌ పై భారత్ గెలుపు | India's win over Philippines | Sakshi
Sakshi News home page

ఫిలిప్పీన్స్‌ పై భారత్ గెలుపు

Published Wed, May 7 2014 12:41 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

India's win over Philippines

రెండు విభాగాల్లో నెగ్గిన ప్రాంజల
 సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓిషియానియా చివరి క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల హవా కొనసాగుతోంది. ఫిలిప్పీన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆమె సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఘనవిజయం సాధించింది. దీంతో భారత్ 3-0తో ఫిలిప్పీన్స్‌పై కూడా క్లీన్‌స్వీప్ చేసింది.
 
 సోమవారం కివీస్‌నూ 3-0తో ఓడించిన సంగతి తెలిసిందే. మలేసియాలోని కూచింగ్‌లో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో మంగళవారం జరిగిన పోరులో తొలుత సింగిల్స్‌లో ప్రాంజల 6-2, 6-3తో బెర్నాడెట్టె బేల్స్ (ఫిలిప్పీన్స్)పై గెలుపొందగా, రెండో సింగిల్స్‌లో కర్మాన్ కౌర్ తాండి 5-7, 6-2, 6-0తో కిమ్ ఇగ్లూపాస్ (ఫిలిప్పీన్స్)పై నెగ్గింది. చివరగా జరిగిన మహిళల డబుల్స్‌లో ప్రాంజల-కర్మాన్ కౌర్ జోడి 6-1, 6-3తో కిమ్ ఇగ్లూపాస్-డొమినిక్వె ఓంగ్ (ఫిలిప్పీన్స్) జంటపై అలవోక విజయం సాధించింది. బుధవారం జరిగే పోరులో భారత్... థాయ్‌లాండ్‌తో తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement