పుణే: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సౌజన్య భవిశెట్టికి మిశ్రమ ఫలితాలు లభించాయి. సింగిల్స్ విభాగంలో రెండో రౌండ్‌లో ఓడిన సౌజన్య... డబుల్స్‌లో మాత్రం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సింగిల్స్ రెండో రౌండ్‌లో టాప్ సీడ్ మగ్దా లినెట్టి (పోలెండ్) 6-2, 6-2తో సౌజన్యను ఓడించింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సౌజన్య-షర్మదా (భారత్) ద్వయం 6-7 (1/7), 6-3, 10-8తో తమారా కురోవిక్ (సెర్బియా)-డయానా మార్సికెవికా (లాత్వియా) జంటపై గెలిచింది.
క్వార్టర్స్‌లో నిధి
ముంబైలో జరుగుతున్న ఐటీఎఫ్ జూనియర్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిధి సూరపనేని క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో నిధి 6-2, 6-3తో తనూశ్రీపై నెగ్గింది.
సెమీస్‌లో సౌజన్య జోడి
Published Wed, Dec 4 2013 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 1:15 AM
Advertisement
Advertisement