దేదీప్య అదుర్స్ | sai dhadipai entered i quarter finals | Sakshi
Sakshi News home page

దేదీప్య అదుర్స్

Published Wed, Feb 5 2014 12:12 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

sai dhadipai entered i quarter finals

 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి దేదీప్య కోల్‌కతాలో జరుగుతున్న సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నీలో అదరగొడుతోంది. అఖిల భారత టెన్నిస్ టోర్నీకి అర్హత కోసం నిర్వహిస్తున్న ఈ టోర్నీలో దేదీప్య అండర్-14 సింగిల్స్‌తో పాటు అండర్-16 సింగిల్స్, డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది.
 
 సోమవారం జరిగిన అండర్-14 ప్రిక్వార్టర్స్‌లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన అనన్య యాదవ్‌పై 6-0, 6-1తో అద్భుత విజయం సాధించిన దేదీప్య అండర్-16 ప్రిక్వార్టర్స్‌లో అదే రాష్ట్రానికి చెందిన శ్రుతి గుప్తాపై 6-1, 6-4తో గెలుపొందింది. ఇక అండర్-14 క్వార్టర్స్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన షేక్ హుమేరాతో, అండర్-16 క్వార్టర్ ఫైనల్లో ఉత్తరప్రదేశ్ అమ్మాయి ఆర్జా చక్రవర్తితో దేదీప్య తలపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement