రెండో రౌండ్‌లో ఇస్కా తీర్థ | second round esaka theeratha in tennis tournment | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో ఇస్కా తీర్థ

Published Wed, Jan 22 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:51 AM

second round esaka theeratha in tennis tournment

 ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో రాష్ట్ర క్రీడాకారిణులు ఇస్కా తీర్థ, అక్షర ఇస్కా, వైష్ణవి శ్రీపెద్దిరెడ్డిలు రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. సికింద్రాబాద్ క్లబ్‌లో జరుగుతున్న ఈ పోటీల్లో రెండో రోజు మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో ఇస్కా తీర్థ 6-1, 6-7, 6-0 స్కోరుతో లిఖిత శెట్టి (కర్ణాటక)పై విజయం సాధించింది.

ఇతర మ్యాచ్‌ల్లో అక్షర ఇస్కా (ఏపీ) 6-2, 6-3తో నిత్య రాజ్ బాబు (తమిళనాడు)పై, శ్వేత శ్రీహరి (తమిళనాడు) 6-2, 6-3తో రష్మిత పసుల రెడ్డి(ఏపీ)పై, వైభవి త్రివేది (గుజరాత్) 6-4, 6-0తో సూర్య తేజస్విని(ఏపీ)పై, వైష్ణవి శ్రీపెద్ది రెడ్డి 6-3,6-0తో డయానా(తమిళనాడు)పై గెలిచారు.
 
 పురుషుల సింగిల్స్ తొలి రోజు ఫలితాలు: ఎస్.పృథ్వీ (తమిళనాడు) 6-3, 6-3తో మణీందర్ సింగ్ (హర్యానా), కునాల్ ఆనంద్ (ఢిల్లీ) 6-7, 6-4, 6-1తో విఘ్నేష్ వీరభద్రన్(తమిళనాడు)పై, నిఖిల్ సాయి (ఏపీ) 6-1, 2-6, 6-2తో ప్రజ్వల్ దేవ్(కర్ణాటక)పై,  అజయ్ కుమార్ (ఏపీ) 6-3, 0-6, 6-2తో చంద్రిల్ సూద్ (యూపీ)పై నెగ్గారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement