ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: మీరా స్మారక ప్రైజ్‌మనీ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జ్ఞానభాస్కర్ కైవసం చేసుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను గోవర్ధన్,ప్రదీప్ రెడ్డి జోడి గెల్చుకుంది. రమ్యాస్ టెన్నిస్ అకాడమీలో మంగళవారం జరిగిన సింగిల్స్ ఫైనల్లో జ్ఞానభాస్కర్ 10-7 స్కోరుతో ఎం.సాయి జితేష్‌పై విజయం సాధించాడు.
సెమీఫైనల్లో జ్ఞాన భాస్కర్ 9-3తో పి.అజయ్‌పై, జితేష్ స్వామి 9-8 (7-4)తో సూర్య పవన్‌పై నెగ్గారు. డబుల్స్ ఫైనల్లో గోవర్ధన్, ప్రదీప్ రెడ్డి జోడి 9-5తో పి.అజయ్, సాయికుమార్ జోడిపై గెలిచింది. పురుషుల 35+ సింగిల్స్ ఫైనల్లో డి.రామకృష్ణ 8-3తో కె.వి.ఎన్.మూర్తిపై గెలిచాడు. సెమీఫైనల్లో కె.వి.ఎన్.మూర్తి 9-7తో వహీద్‌పై, రామకృష్ణ 9-6తో డి.మనీష్‌పై గెలిచారు. డబుల్స్ ఫైనల్లో వహీద్, మూర్తి జోడి 9-4తో రామకృష్ణ, మనీష్ జోడిపై గెలిచింది.
టెన్నిస్ చాంప్ జ్ఞానభాస్కర్
Published Wed, Feb 5 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement
Advertisement