ఆసియా ఓసియానియా టెన్నిస్
సాక్షి, హైదరాబాద్: మలేసియాలోని కూచింగ్‌లో జరుగుతున్న ఆసియా ఓసియానియా ఫైనల్ క్వాలిఫయింగ్ టెన్నిస్ టోర్నీలో భారత్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల సింగిల్స్‌తోపాటు డబుల్స్‌లోనూ సత్తా చాటడంతో భారత్ 2-1 తేడాతో ఇండోనేషియాపై గెలుపొందింది. టోర్నీలో 5 నుంచి 8వ స్థానాల కోసం జరుగుతున్న పోటీల్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సింగిల్స్‌లో ప్రాంజల 6-0, 6-2 తేడాతో రైఫాంటీ డ్వికఫియానిపై గెలిచింది.
రెండో సింగిల్స్‌లో అబినికా రంగనాథన్ 6-4, 1-6, 2-6 తేడాతో అర్రుమ్ దమర్సరి చేతిలో ఓడడంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే డబుల్స్‌లో ప్రాంజల-కర్మాన్ కౌర్ జోడి 4-6, 6-4, 6-3 తేడాతో కఫియాని-దమర్సరి జంటను ఓడించి భారత్‌కు విజయాన్నందించారు. తమ తదుపరి మ్యాచ్‌ను భారత్ శనివారం చైనీస్ తైపీతో ఆడనుంది.
ఇండోనేషియాపై భారత్ గెలుపు
Published Sat, May 10 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:08 AM
Advertisement