ఫైనల్లో సంస్కృతి, సంజన | samskruthi,Sanjana entered in finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో సంస్కృతి, సంజన

Published Sat, Mar 8 2014 11:58 PM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM

samskruthi,Sanjana entered in finals

 ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ
 జింఖానా, న్యూస్‌లైన్: ఆస్టర్ మైండ్స్ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-12 బాలికల విభాగంలో సంస్కృతి, సంజన ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన ఈ టోర్నీ సెమీఫైనల్లో సంస్కృతి 8-0తో ప్రాచిపై గెలుపొందగా, సంజన 8-2తో శ్రీహర్షితపై నెగ్గి తుది పోరుకు సిద్ధమైంది. అండర్-14 బాలికల విభాగంలో సంస్కృతి 6-2తో సృజనపై నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. మరో మ్యాచ్‌లో లాస్య 6-1తో అవంతికా రెడ్డిపై, సంజన 6-1తో అర్చిత రెడ్డిపై గెలుపొందారు. బాలుర విభాగం క్వార్టర్‌ఫైనల్లో శశిప్రీతమ్ 7-6 (7/5)తో వరుణ్  కుమార్‌పై గెలిచి సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.
 
  తనతో పాటు చెన్నాడి సాహిల్ 7-4తో అర్జున్ రెడ్డిపై, తనిష్క్ 7-6తో సుహిత్ రెడ్డిపై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నారు. అండర్-12 బాలుర  విభాగం క్వార్టర్‌ఫైనల్లో అన్నే ఆకాశ్ 7-5తో శశిధర్‌పై, కార్తీక్ నీల్ 7-2తో అనికేత్‌పై, తన్మయ్ 7-6తో కౌషిక్ కుమార్ రెడ్డిపై గెలిచారు. అండర్-10 విభాగంలో కార్తీక్ నీల్ 7-2తో ముకుంద్ రెడ్డిని ఓడించగా, సిద్ధార్థ్ రెడ్డి 7-0తో జయ్ కృష్ణపాల్‌పై గెలిచాడు. రుషికేశ్ 7-0తో యశ్వంత్ చౌదరిని, వర్షిత్ కుమార్ 7-6తో ప్రతినవ్‌ను ఓడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement