ఎస్‌ఎమ్‌టీఏ-ఐటా టెన్నిస్ టోర్నీ
సాక్షి, హైదరాబాద్: సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ) - ఐటా టాలెంట్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో రాతకొండ శ్రీవత్స, యెడ్ల కుశాల్ అండర్-14 బాలుర విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించారు. మొయినాబాద్‌లోని ఎస్‌ఎమ్‌టీఏలో గురువారం జరిగిన సెమీఫైనల్లో శ్రీవత్స 6-3, 6-2తో మెంగ రోహిత్‌పై గెలుపొందగా, కుశాల్ 6-4, 6-2తో తెయ్‌జో ఓజెస్‌ను కంగుతినిపించాడు.
అండర్-12 బాలుర సెమీస్‌లో ఆర్యన్ జవేరి 7-5, 6-1తో దేవ్ జెవియాపై, మహేశ్ మహాపాత్ర 6-2, 4-6, 6-2తో ఎస్.భూపతిపై విజయం సాధించారు. బాలికల అండర్-12 సెమీస్‌లో రిచా చోగులే 4-6, 6-0, 6-0తో శ్రేయ కుదుమాలపై గెలుపొందగా, రేష్మ మారురి 6-1, 6-2తో ధ్రుతి కపూర్‌పై నెగ్గింది. బాలికల అండర్-14 సెమీఫైనల్లో సాయి దేదీప్య 6-1, 6-4తో అమినేని శివానిపై, ధరణ ముదలియార్ 7-6 (7/5), 6-1తో రితిక బాజర్‌పై విజయం సాధించారు.
ఫైనల్లో శ్రీవత్స, దేదీప్య
Published Fri, Apr 25 2014 12:28 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement