![Sona Comstar to acquire 54percent stake in Serbian firm NOVELIC - Sakshi](/styles/webp/s3/article_images/2023/01/13/SONA.jpg.webp?itok=9v0N4JIp)
న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ సంస్థ సోనా బీఎల్‌డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ (సోనా కామ్‌స్టార్) తాజాగా సెర్బియాకు చెందిన నోవెలిక్‌లో 54 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ 40.5 మిలియన్ యూరోలు (సుమారు రూ. 356 కోట్లు). అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ఏడీఏఎస్) సెన్సార్స్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఇది ఉపయోగపడనుంది. ఆటోమోటివ్ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈ విభాగం 2030 నాటికి 43 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి.
వాటాల కొనుగోలు డీల్ 2023 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని సోనా కామ్‌స్టార్ ఎడీ వివేక్ విక్రమ్ సింగ్ తెలిపారు. తదుపరి దశ వృద్ధి కోసం సోనాతో భాగస్వామ్యం ఉపయోగపడగలదని నోవెలిక్ సహ వ్యవస్థాపకుడు వెల్కో మిహాయ్‌లోవిక్ చెప్పారు. గతేడాది నోవెలిక్ ఆదాయం 9.3 మిలియన్ యూరోలుగా ఉండగా, లాభం 2.5 మిలియన్ యూరోలుగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment