చూడ్డానికి పెయింటింగ్‌లా కనిపిస్తోంది కదూ.. కానీ ఇలాంటి ఇల్లు నిజంగానే ఉంది. సెర్బియాలోని బజీనా బాస్టా పట్టణంలో డ్రైనా నది మధ్యలో ఈ నివాసాన్ని నిర్మించారు. గతేడాది హంగేరియన్ ఫొటోగ్రాఫర్ తీసిన ఈ చిత్రానికి నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ వారి ‘ఫొటోస్ ఆఫ్ ది డే’ పురస్కారం కూడా లభించింది. అప్పట్నుంచి ఈ నది మధ్యలోని నివాసంపై ప్రపంచ పర్యాటకుల దృష్టి పడింది. ఈ ఇంటిని 1968లో కొందరు కుర్రాళ్లు నిర్మించారట. సెర్బియాలో అది ఫేమసేగానీ.. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి తెలిసింది తక్కువే. ప్రస్తుతం ఇది అంతటా ప్రాచుర్యం పొందడంతో దీన్ని చూడటానికి పర్యాటకులు క్యూ కడుతున్నారట.
గులాబీ సరస్సు...
ఇదో సరస్సు! చూశారుగా.. గులాబీ రంగులో ఎంత చక్కగా కనిపిస్తోందో.. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ ఉప్పు నీటి సరస్సు ఆస్ట్రేలియాలోని రిషెర్ష్ ఆర్కిపెలాగో ద్వీపంలో ఉంది. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్‌లా కనిపించే హిల్లియర్ అనే ఈ సరస్సు ఎంత ప్రాచుర్యం పొందిందంటే.. దీని మీదుగా విమానాలు వెళ్లినప్పుడు అందులోని ప్రయాణికులు తమ సీట్లలోంచి లేచి.. కిటికీల వద్దకు చేరిపోతారట. ఇంతకీ దీనికీ రంగు రావడానికి గల కచ్చితమైన కారణాన్ని శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఈ సరస్సులో ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల ఈ రంగు వచ్చిందనే వాదన వినవస్తున్నా.. దాన్ని కూడా ఎవరూ కచ్చితంగా నిర్థరించడం లేదు.
నదీ జలాల మధ్య ఆకట్టుకునే ఇల్లు
Published Thu, Oct 17 2013 9:11 AM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM
Advertisement
Advertisement