
ఫ్లోరిడా: మయామి మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నమెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన ఈ సెర్బియా ప్లేయర్ రెండో రౌండ్‌లో 7–6 (7/2), 6–2తో ప్రపంచ 81వ ర్యాంకర్ బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. గతంలో ఆరుసార్లు ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన జొకోవిచ్ మూడో రౌండ్‌లో డెల్‌బోనిస్ (అర్జెంటీనా)తో ఆడతాడు. మరోవైపు మూడో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు.
గతవారం ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ గెలిచిన థీమ్ మయామి ఓపెన్‌లో మాత్రం నిరాశ పరిచాడు. తొలి రౌండ్‌లో బై పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన థీమ్ 4–6, 4–6తో హుర్కాజ్ (పోలాండ్) చేతిలో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment