
దక్షిణ కొరియా ఆటగాడు హెయన్ చుంగ్
మెల్‌బోర్న్ : ఆస్ట్రేలియా ఓపెన్‌లో దక్షిణ కొరియాకు చెందిన అన్‌సీడెడ్ ఆటగాడు చుంగ్ హెయన్ సోమవారం సంచలన విజయం సాధించాడు. హోరాహోరీగా జరిగిన మూడు సెట్ల మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జకోవిచ్‌కు షాకిచ్చాడు చుంగ్.
7-6, 7-5, 7-6 తేడాతో జకోవిచ్‌ను మట్టికరిపించాడు. దీంతో దక్షిణ కొరియా నుంచి ఓ గ్రాండ్‌స్లామ్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు చుంగ్. మ్యాచ్ మొత్తంలో 19 అనవసర తప్పిదాలు చేసిన జకో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. జకో సర్వీసులను చుంగ్ రెండుసార్లు బ్రేక్ చేయగా.. ఒక్కసారి మాత్రమే చుంగ్ సర్వీసును జకో బ్రేక్ చేశాడు.
ఈ ఓటమితో సెర్బియా స్టార్ జకోవిచ్ టోర్ని నుంచి నిష్క్రమించాడు. జకోవిచ్ గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment