
FIFA World Cup 2022: Serbia Qualified After Beat Portugal Shock To Ronaldo Team: మరో ఐదు నిమిషాలు సెర్బియాను గోల్ చేయకుండా నిలువరించి ఉంటే... విఖ్యాత ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో నాయకత్వంలోని పోర్చుగల్ జట్టు... వచ్చే ఏడాది ఖతర్‌లో జరిగే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించేది. కానీ మ్యాచ్ 90వ నిమిషంలో సెర్బియా ప్లేయర్ మిత్రోవిచ్ గోల్ చేసి తమ జట్టును 2–1తో ఆధిక్యంలో నిలిపాడు.
ఇంజ్యూరీ టైమ్‌గా అదనంగా ఐదు నిమిషాలు జతచేయడంతో పోర్చుగల్‌కు స్కోరును సమం చేసేందుకు అవకాశం లభించినా ఫలితం లేకపోయింది. దాంతో సెర్బియా విజయం ఖాయ మైంది. యూరోప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా సెర్బియా 20 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ టాపర్‌గా నిలిచి ప్రపంచకప్ బెర్త్‌ను దక్కించుకుంది. 17 పాయిం ట్లతో గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచిన పోర్చుగల్ జట్టు... వచ్చే ఏడాది మార్చిలో ప్లే ఆఫ్ మ్యాచ్‌ల్లో గెలిస్తే ప్రపంచకప్ బెర్త్ లభిస్తుంది.
చదవండి: IND vs NZ T20I Series 2021: భారత్‌తో టీ20 సిరీస్ ముందు కివీస్‌కు షాక్.. తప్పుకొన్న విలియమ్సన్.. ఎందుకంటే..
FIFA World Cup 2022: ఫ్రాన్స్ అర్హత.. బెల్జియం, క్రొయేషియా కూడా
Comments
Please login to add a commentAdd a comment