
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. యూఎస్ ఓపెన్-2023 మెన్స్ సింగిల్ విజేతగా జొకోవిచ్ నిలిచాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదెవ్‌ను చిత్తు చేసిన జొకోవిచ్.. నాలుగో సారి యూఎస్ ఓపెనర్ ఛాంపియన్‌గా అవతరించాడు. అంతకుముందు 2021లో ఇదే టోర్నీ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించి మెద్వెదేవ్ చరిత్రపుటలకెక్కాడు.
దీంతో ఈసారి ఫైనల్ పోరు రసవత్తరంగా సాగుతుందని అంతా భావించారు. కానీ జకోవిచ్ మాత్రం ప్రత్యర్ధికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఈ తుది పోరులో వరుస సెట్లలో 6-3, 7-6 (7-5), 6-3 తేడాతో మూడో సీడ్ మెద్వెదెవ్‌ను జకో ఓడించాడు.
ఈ విజయంతో కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను జకో తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అత్యధిక గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన క్రీడాకారిణిగా ఉన్న ఆస్ట్రేలియా దిగ్గజం మార్గరెట్ కోర్టు (24) రికార్డును ఈ సెర్భియా యోదుడు సమం చేశాడు. ఏడాది చాంపియన్‌గా నిలిచిన జకోవిచ్‌కు రూ. 25 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.
చదవండి: Asia Cup 2023: షాహీన్ అఫ్రిది మంచి మనసు.. బుమ్రాకు సర్‌ప్రైజ్ గిప్ట్! వీడియో వైరల్
Novak Djokovic continues to write history.@AustralianOpen | @rolandgarros | @Wimbledon pic.twitter.com/RrBFOQdiN6
— US Open Tennis (@usopen) September 11, 2023