భారత్‌ 0 – సెర్బియా 2 | Ramkumar, Prajnesh suffer defeats as Serbia lead India 2-0 | Sakshi
Sakshi News home page

భారత్‌ 0 – సెర్బియా 2

Published Sat, Sep 15 2018 5:12 AM | Last Updated on Sat, Sep 15 2018 5:12 AM

Ramkumar, Prajnesh suffer defeats as Serbia lead India 2-0 - Sakshi

రామ్‌కుమార్‌

క్రాల్‌జివో (సెర్బియా): యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ నొవాక్‌ జొకోవిచ్‌ లేకపోయినా ఆ అవకాశాన్ని భారత జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. డేవిస్‌ కప్‌ టెన్నిస్‌ ప్రపంచ గ్రూప్‌ ప్లే ఆఫ్‌లో భాగంగా సెర్బియా జట్టుతో శుక్రవారం మొదలైన పోటీలో తొలి రోజు రెండు సింగిల్స్‌లో భారత ఆటగాళ్లు ఓటమి పాలయ్యారు. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్‌ 6–3, 4–6, 6–7 (2/7), 2–6తో ప్రపంచ 86వ ర్యాంకర్‌ లాస్లో జెరె చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌ 4–6, 3–6, 3–6తో ప్రపంచ 56వ ర్యాంకర్‌ దుసాన్‌ లాజోవిచ్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. శనివారం జరిగే డబుల్స్‌ మ్యాచ్‌లో మిలోజెవిచ్‌–పెట్రోవిచ్‌ జోడీతో రోహన్‌ బోపన్న–శ్రీరామ్‌ బాలాజీ జంట ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో బోపన్న ద్వయం గెలిస్తేనే ఈ పోటీలో భారత ఆశలు సజీవంగా ఉంటాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement