బెల్‌గ్రేడ్: సెర్బియాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. తుపాకీ పట్టుకున్న ఒక దుండగుడు కదులుతున్న కారులోంచి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని బెల్‌గ్రేడ్‌కు దక్షిణంగా కారులో ప్రయాణిస్తూ మూడు గ్రామాల పరిధిలో ఆటోమేటెడ్ గన్‌తో అతను ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, మరో 14 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం నిందితుడ్ని అదుపులోనికి తీసుకుంది. ఆ వ్యక్తి ధరించిన నీలం రంగు టీ షర్ట్‌పై నాజీల అనుకూల నినాదాలు ఉన్నాయి. అయితే అతను ఎందుకు ఈ కాల్పులు జరిపాడో ఇంకా తెలియాల్సి ఉంది. స్కూలు విద్యార్థి జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన జరిగిన రెండు రోజులకే మరొకటి జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment