ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి మొరాకో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక డిసెంబర్ 18న జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది.
ఇక కీలకమైన ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్‌కు ఒక గుడ్‌న్యూస్ అందినట్లు సమాచారం.గాయం కారణంగా ఫిఫా వరల్డ్‌కప్‌కు దూరమైన జట్టు స్టార్ స్ట్రైకర్ కరీం బెంజెమా ఫైనల్‌కు తిరిగి టీమ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందు ఖతార్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. బెంజెమా తొడ గాయానికి గురయ్యాడు. దీంతో వరల్డ్‌కప్ టీమ్‌కు దూరమయ్యాడు.
మాడ్రిడ్‌కు వెళ్లిపోయిన బెంజెమా అక్కడ గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి సారించాడు. గాయం కారణంగా ఇలా టీమ్‌కు దూరమవడంపై బెంజెమా ఎంతో నిరాశ చెందాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తన స్థానాన్ని మరొకరికి ఇచ్చి వెళ్లిపోతున్నట్లు చెప్పాడు. అయితే అప్పటి నుంచీ మాడ్రిడ్‌లో ట్రైనింగ్ చేస్తున్న బెంజెమా.. ఎలాంటి ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడటం లేదని స్పెయిన్ మీడియా వెల్లడించింది.
దీంతో అతడు ఫైనల్ మ్యాచ్‌కు తిరిగి ఫ్రాన్స్ టీమ్‌తో చేరతాడన్న వార్తలు ఊపందుకున్నాయి. అదే జరిగితే ఆ టీమ్ బలం మరింత పెరగనుంది. ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్లలో ఒకడిగా కరీం బెంజెమాకు పేరుంది. ఇప్పటి వరకూ ఫ్రాన్స్ తరఫున 97 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 37 గోల్స్ చేశాడు.
చదవండి: మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక
Comments
Please login to add a commentAdd a comment