Karim Benzema
-
మళ్లీ ఓడిన ఎంబాపె.. మెస్సీదే పైచేయి
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డును కొల్లగొట్టాడు. భారత కాలామాన ప్రకారం మంగళవారం తెల్లవారుజామున పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్(FIFA) నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ అవార్డ్స్‌లో మెస్సీ ఈ అవార్డు అందుకున్నాడు. గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనాను మెస్సీ విశ్వవిజేతగా నిలిపిన సంగతి తెలిసిందే. 36 సంవత్సరాల అర్జెంటీనా అభిమానుల నిరీక్షణకు తెరదించిన మెస్సీ వరల్డ్‌కప్ అందుకోవాలన్న తన చిరకాల కోరికను కూడా నెరవేర్చుకున్నాడు. ఇక గతేడాది జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ కొదమసింహాల్లా తలపడ్డాయి. మెస్సీ రెండు గోల్స్‌తో మెరవగా.. ఎంబాపె ఏకంగా హ్యాట్రిక్ గోల్స్‌తో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ 3-3తో డ్రా కావడంతో పెనాల్టీ షూటౌట్‌కు దారి తీసింది. ఇక పెనాల్టీ షూటౌట్లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. మ్యాచ్ ఓడినా ఎంబాపె మాత్రం తన ప్రదర్శనతో అభిమానుల హృదయాలను దోచుకున్నాడు. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న మెస్సీ తాజాగా ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్స్ కైలియన్ ఎంబాపె, కరీమ్ బెంజెమాలు పోటీ పడ్డారు. అయితే మెస్సీని దాటి అవార్డు అందుకోవడంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. 2021 ఆగస్టు 8 నుంచి 18 డిసెంబర్ 2022 వరకు మెన్స్ ఫుట్‌బాల్‌లో ఔట్‌స్టాండింగ్ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్ల జాబితాను ఎంపిక చేశారు. ఈ జాబితాలో మెస్సీ 52 పాయింట్లతో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోగా.. కైలియన్ ఎంబాపె 44 పాయింట్లతో రెండో స్థానం, కరీమ్ బెంజెమా 34 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. కాగా మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇంతకముందు వరుసగా 2009, 2010, 2011, 2012, 2015, 2019.. తాజాగా 2023లో మరోసారి అవార్డును గెలుచుకున్నాడు. ఉత్తమ FIFA ఉమెన్స్ ప్లేయర్ విజేత: అలెక్సియా పుటెల్లాస్ ఉత్తమ FIFA పురుషుల కోచ్ విజేత: లియోనెల్ స్కలోని ఉత్తమ FIFA మహిళా కోచ్ విజేత: సరీనా విగ్మాన్ ఉత్తమ FIFA పురుషుల గోల్ కీపర్ విజేత: ఎమిలియానో మార్టినెజ్ ఉత్తమ FIFA మహిళా గోల్ కీపర్ విజేత: మేరీ ఇయర్ప్స్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) MESSI IS THE WINNER OF THE BEST AWARD ❤️🐐 pic.twitter.com/4pJhMoVCI6 — Messi Media (@LeoMessiMedia) February 27, 2023 -
శకం ముగిసింది.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్
ఫుట్‌బాల్‌లో ఒక శకం ముగిసింది. ఫ్రాన్స్ స్టార్ ఫుట్‌బాలర్ కరీమ్ బెంజెమా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం రాత్రి తన ట్విటర్లో బెంజెమా రిటైర్మెంట్ విషయాన్ని పేర్కొన్నాడు. ఆదివారం ఖతర్ వేదికగా జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్ పెనాల్టీ షూటౌట్లో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బెంజెమా తన ట్విటర్లో స్పందించాడు. ''ఫ్రాన్స్ ఓటమి నన్ను బాధించింది.. ఫిట్నెస్, ఇతర కారణాల రిత్యా అంతర్జాతీయ కెరీర్ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నా.. ఇన్నాళ్లు ఫ్రాన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. నాపై ప్రేమను చూపించిన అభిమానులందరికి కృతజ్క్షతలు. ఫిఫా వరల్డ్‌కప్ లేకుండానే రిటైర్మెంట్ ఇవ్వడం బాధ కలిగిస్తుంది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు.. అందుకే గుడ్‌బై చెప్పేశా'' అంటూ పేర్కొన్నాడు. J’ai fait les efforts et les erreurs qu’il fallait pour être là où je suis aujourd’hui et j’en suis fier ! J’ai écrit mon histoire et la nôtre prend fin. #Nueve pic.twitter.com/7LYEzbpHEs — Karim Benzema (@Benzema) December 19, 2022 బెంజెమా సోమవారమే తన 36వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఇలా పుట్టినరోజు నాడే రిటైర్మెంట్ ప్రకటించి తన అభిమానులను షాక్‌కు గురిచేశాడు. 2007లో ఫ్రాన్స్ తరఫున అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన బెంజెమా 97మ్యాచుల్లో 37గోల్స్ కొట్టాడు.2015లో సెక్స్-టేప్ కేసులో బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు ఋజువు కావడంతో ఆ దేశ ఫుట్‌బాల్ సమాఖ్య బెంజెమాపై ఐదేళ్ల నిషేధం విధించింది. 2021లో తిరిగి పునారాగమనం చేసిన బెంజెమా యూరోపియన్ ఛాంపియన్షిప్ ప్రి క్వార్టర్స్‌లో ఏకంగా నాలుగు గోల్స్ కొట్టి ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు. ఈ ప్రపంచకప్‌లో కరీమ్ బెంజెమా తన మాయ చూపిస్తాడని అంతా భావించారు. కానీ ఫిఫా ప్రపంచకప్ ఆరంభానికి ముందే తొడ కండరాల గాయంతో బాధపడుతూ కరీమ్ బెంజెమా జట్టుకు దూరమయ్యాడు. అలా ఫ్రాన్స్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కరీమ్ బెంజెమా ఫిఫా వరల్డ్‌కప్ లేకుండానే తన కెరీర్‌ను ముగించాడు. ఇక ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన కరీమ్ బెంజెమా ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్(Ballon D'Or) అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Kylian Mbappe: నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె మెస్సీ మాయలో పట్టించుకోలేదు.. పొరపాటా లేక కావాలనేనా? -
ఫైనల్ ముందు ఫ్రాన్స్‌కు గుడ్‌న్యూస్.. కరీం బెంజెమా వచ్చేస్తున్నాడు!
ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. బుధవారం రాత్రి మొరాకో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో గెలిచిన ఫ్రాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక డిసెంబర్ 18న జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్లో అర్జెంటీనాతో తలపడనుంది. ఇక కీలకమైన ఫైనల్‌కు ముందు ఫ్రాన్స్‌కు ఒక గుడ్‌న్యూస్ అందినట్లు సమాచారం.గాయం కారణంగా ఫిఫా వరల్డ్‌కప్‌కు దూరమైన జట్టు స్టార్ స్ట్రైకర్ కరీం బెంజెమా ఫైనల్‌కు తిరిగి టీమ్‌లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టోర్నీ ప్రారంభానికి ముందు ఖతార్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా.. బెంజెమా తొడ గాయానికి గురయ్యాడు. దీంతో వరల్డ్‌కప్ టీమ్‌కు దూరమయ్యాడు. మాడ్రిడ్‌కు వెళ్లిపోయిన బెంజెమా అక్కడ గాయం నుంచి కోలుకోవడంపై దృష్టి సారించాడు. గాయం కారణంగా ఇలా టీమ్‌కు దూరమవడంపై బెంజెమా ఎంతో నిరాశ చెందాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తన స్థానాన్ని మరొకరికి ఇచ్చి వెళ్లిపోతున్నట్లు చెప్పాడు. అయితే అప్పటి నుంచీ మాడ్రిడ్‌లో ట్రైనింగ్ చేస్తున్న బెంజెమా.. ఎలాంటి ఫిట్నెస్ సమస్యలతో బాధపడటం లేదని స్పెయిన్ మీడియా వెల్లడించింది. దీంతో అతడు ఫైనల్ మ్యాచ్‌కు తిరిగి ఫ్రాన్స్ టీమ్‌తో చేరతాడన్న వార్తలు ఊపందుకున్నాయి. అదే జరిగితే ఆ టీమ్ బలం మరింత పెరగనుంది. ప్రపంచంలోని అత్యుత్తమ స్ట్రైకర్లలో ఒకడిగా కరీం బెంజెమాకు పేరుంది. ఇప్పటి వరకూ ఫ్రాన్స్ తరఫున 97 మ్యాచ్‌లు ఆడిన అతడు.. 37 గోల్స్ చేశాడు. చదవండి: మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక FIFA: గాయంతో అన్న దూరం.. తమ్ముడు అదరగొడుతున్నాడు