ఖతర్ వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా కైవసం చేసుకుంది. ఆదివారం ఫ్రాన్స్‌తో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో ఫ్రాన్స్‌ను మట్టికరిపించి మూడోసారి ఫిఫా టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక అర్జెంటీనాకు తొలి రెండు వరల్డ్‌కప్‌లు సాధించడానికి కేవలం ఎనిమిది సంవత్సరాలు మాత్రమే పడితే.. మూడో టైటిల్ సాధించడానికి మాత్రం 36 సంవత్సరాల ఎదురుచూపులు తప్పలేదు.
అర్జెంటీనా 1978లో తొలిసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించింది. అప్పట్లో నెదర్లాండ్స్‌తో జరిగిన ఫైనల్లో 3-1 తేడాతో నెగ్గిన అర్జెంటీనా విశ్వవిజేతగా నిలిచింది. తొలి వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా నెగ్గడంలో మారియో కెంపెస్‌ది కీలకపాత్ర. ఇక 1986లో అర్జెంటీనా రెండోసారి ఫిఫా వరల్డ్‌కప్ నెగ్గిన సమయంలో డీగో మారడోనా అన్నీ తానై జట్టును నడిపించాడు. జర్మనీతో జరిగిన ఫైనల్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఓడించి రెండోసారి విజేతగా అవతరించింది.
ఇక మారడోనా తర్వాత అంతటి పేరును సంపాదించిన మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ను సాధించింది. 2022లో ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని అందుకుంది. ఈతరం గొప్ప ఆటగాళ్లలో టాప్ పొజీషన్‌లో ఉన్న మెస్సీ తన కెరీర్‌లో ఎన్నో టైటిల్స్ సాధించినప్పటికి ఫిఫా వరల్డ్‌కప్ లేదన్న లోటు అలాగే మిగిలిపోయింది. తాజాగా మెస్సీ తన కలను నెరవేర్చుకున్నాడు. అన్నీ తానై జట్టును నడిపించిన మెస్సీ.. అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ ఆడడం.. తన చివరి మ్యాచ్‌లోనే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ టైటిల్ కొట్టడం అతనికి ఘనమైన వీడ్కోలు అని చెప్పొచ్చు. ఇక ఫుట్‌బాల్ బతికున్నంతవరకు మెస్సీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.
The third nation to win a #FIFAWorldCup Final on penalties 🔥
— JioCinema (@JioCinema) December 18, 2022
Watch the 🤯 penalty shoot-out from #FRAARG 📽️#Qatar2022 #WorldsGreatestShow #FIFAWConJioCinema #FIFAWConSports18 pic.twitter.com/OwAIjHdqi7
Comments
Please login to add a commentAdd a comment