
ఖతర్ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో చిత్తు చేసిన అర్జెంటీనా ముచ్చటగా మూడోసారి వరల్డ్‌కప్‌ను ఎగురేసుకుపోయింది. అర్జెంటీనా కప్పు కొట్టగానే స్టేడియం మొత్తం మెస్సీ నామస్మరణతో ఊగిపోయింది. అయితే ఈ గ్యాప్‌లోనే ఒక యువతి నగ్న ప్రదర్శన చేయడం హల్‌చల్‌గా మారింది. అయితే మెస్సీ మాయలో దీనిని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ లేకుంటే పెద్ద వివాదం అయ్యుండేది.
విషయంలోకి వెళితే.. ఫ్రాన్స్‌పై విజయం సాధించాకా అర్జెంటీనా అభిమానులు దేశ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. ఇంతలో ఒక అర్జెంటీనా అభిమానుల గుంపులో ఒక యువతి టాప్‌లెస్‌గా దర్శనమిచ్చింది. జెండాల మధ్యలో నిలబడిన యువతి చాతి భాగం కనిపించేలా నగ్న ప్రదర్శన చేసింది. ఆమె చర్యతో ఆశ్చర్యపోయిన మిగతావారు.. ఇక్కడే ఉంటే ఆమె ప్రాణాలకు ప్రమాదమని.. ఎస్కార్ట్ సాయంతో అక్కడి నుంచి పంపించేశారు.
అయితే ఫైనల్ ముగిసిన ఒకరోజు తర్వాత ఈ ఫోటోలు బయటికి రావడంతో పెద్దగా దుమారం జరగలేదు. అయితే యువతి చర్యను తప్పుబట్టిన ఖతర్ అధికారులు ఆమె ఎక్కడ ఉన్నా నోటీసులు ఇస్తామని.. దానికి బదులు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. మెస్సీ బృందం గెలిచిన సంతోషంలో పొరపాటున అలా చేసిందో లేక కావాలనో తెలియదు కానీ తన అందాల ప్రదర్శనతో ఆమె పక్కన నిల్చున్న వారి మతులు మాత్రం పోగొట్టింది.
చదవండి: వరల్డ్‌కప్ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత
నిండా పాతికేళ్లు లేవు.. ప్రపంచమే సలాం కొట్టింది; ఎవరీ ఎంబాపె
Comments
Please login to add a commentAdd a comment