ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ తుది అంకానికి చేరుకుంది. డిసెంబర్ 18న(ఆదివారం) అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య తుది సమరం జరగనుంది. టైటిల్ సాధించి మెస్సీ తన కలను నెరవేర్చుకుంటాడా లేక డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ వరుసగా రెండోసారి వరల్డ్‌కప్‌ను నిలబెట్టుకుంటుందా అనేది చూడాలి.
ఇక అర్జెంటీనా జట్టును మెస్సీ అన్ని తానై నడిపిస్తున్నాడు. కెరీర్‌లోనే అత్యున్నత ఫామ్‌లో ఉన్న మెస్సీ ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటివరకు ఐదుగోల్స్ కొట్టి గోల్డెన్ బైట్ అవార్డు రేసులో ఉన్నాడు. అయితే మెస్సీ ఇంత సక్సెస్ కావడం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు అదెవరో తెలుసా.. లియోనల్ స్కలోని. అర్జెంటీనా కోచ్‌గా లియోనల్ స్కలోని జట్టును అద్బుతంగా నడిపిస్తున్నాడు. కోచ్‌గా మంచి ఆఫర్స్ వచ్చినప్పటికి మెస్సీ సారధ్యంలోని అర్జెంటీనా ఎలాగైనా ఫిఫా వరల్డ్‌కప్ కొట్టాలని ఆశపడుతున్నాడు. స్కలోని తన కలను నెరవేర్చుకునే పనిలోనే ఉన్నాడు. ఇక ఫ్రాన్స్‌తో జరిగే ఆఖరి సమరంలో గెలిచి అర్జెంటీనాను విశ్వవిజేతగా నిలవాలని కోరుకుంటున్నాడు.
గతేడాది మెస్సీ సేన కోపా అమెరికా కప్ కొట్టడంలోనూ లియోనల్ స్కలోనీ కీలకపాత్ర పోషించాడు. అయితే స్కలోని గురించి తాజాగా ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే.. అర్జెంటీనా ఒక్కో అడుగు వేస్తూ ఫైనల్‌కు చేరుకున్న సందర్భంలో స్కలోని ఒక్కసారి కూడా నవ్వలేదట. ఇక క్రొయేషియాతో జరిగిన సెమీఫైనల్లో మెస్సీ ఆటకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఒక గోల్ కొట్టడమే గాక.. మూడు అసిస్ట్‌లు అందించి మరో రెండు గోల్స్ కొట్టడంలో మెస్సీదే కీలకపాత్ర. మెస్సీ అంటే ఎంతో అభిమానం చూపించే స్కలోని.. అతను అంత బాగా ఆడుతున్నా ఒక్కసారి కూడా నవ్వలేదు. అయితే మ్యాచ్ గెలిచిన తర్వాత మెస్సీని హగ్ చేసుకొని స్కలోని ఏడ్చేశాడు. అయితే స్కలోని నవ్వకపోవడం వెనుక ఒక కారణం ఉంది.
అర్జెంటీనా టైటిల్ కొట్టే వరకు తాను నవ్వలేనని లియోనల్ స్కలోని పేర్కొన్నాడు. తాను నవ్వితే అర్జెంటీనా ఎక్కడా ఓడిపోయి ఇంటికి వస్తుందేమోనని భయపడ్డాడు. మెస్సీ బృందం కప్ అందుకోవాలనే కోరిక నెరవేరిన తర్వాతే తాను మనస్పూర్తిగా నవ్వగలను అంటూ స్కలోని తన మనసులోని మాటను బయటపెట్టాడు.
చదవండి: దిగ్గజాలకే సాధ్యం కాలేదు.. మెస్సీ ముంగిట అరుదైన రికార్డు
FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే!
Comments
Please login to add a commentAdd a comment