
దోహా: యువ, అనుభవజ్ఞులైలైన ఆటగాళ్లతో కూడిన ఫ్రాన్స్ జట్టు ఫుట్‌బాల్ ప్రపంచకప్ టోరీ్నలో ఏడోసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన చివరి క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్ 2–1 గోల్స్ తేడాతో 1966 విశ్వవిజేత ఇంగ్లండ్ జట్టును ఓడించింది.
ఫ్రాన్స్ తరఫున చువమెని (17వ ని.లో), ఒలివియర్ జిరూడ్ (78వ ని.లో) ఒక్కో గోల్ చేయగా... ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ హ్యారీ కేన్ (58వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. ఇంగ్లండ్ 1–2తో వెనుకబడిన దశలో 84వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను హ్యారీ కేన్ వృథా చేశాడు. కేన్ కొట్టిన షాట్ గోల్‌పోస్ట్ పైనుంచి బయటకు వెళ్లిపోయింది. లేదంటే ఇంగ్లండ్ 2–2తో స్కోరును సమం చేసేది.
Comments
Please login to add a commentAdd a comment