
లియోనల్ మెస్సీ
FIFA WC 2022 Winner Lionel Messi Comments: ‘‘ఈ టైటిల్‌తో నా కెరీర్ ముగించాలని ఆశపడ్డాను. ఇంతకు మించి నేను కోరుకునేది ఏదీ లేదు. ఇలా ట్రోఫీ సాధించి కెరీర్‌కు వీడ్కోలు పలకడం చాలా బాగుంటుంది కదా! దీని తర్వాత సాధించాల్సింది ఇంకేముంది? కోపా అమెరికా.. ఇప్పుడు వరల్డ్‌కప్.. కెరీర్ చరమాంకంలో నాకు లభించాయి.
సాకర్ అంటే నాకు పిచ్చి ప్రేమ. జాతీయ జట్టుకు ఆడటాన్ని నేను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తాను. వరల్డ్ చాంపియన్‌గా మరో రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నా’’ అంటూ అర్జెంటీనా స్టార్, ప్రపంచకప్ విజేత లియోనల్ మెస్సీ అభిమానులకు శుభవార్త చెప్పాడు.
తాను ఇప్పుడే రిటైర్ కాబోవడం లేదని స్పష్టం చేశాడు. కాగా ఖతర్ వేదికగా ఆదివారం జరిగిన ఫిఫా వరల్డ్‌కప్-2022 ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి అర్జెంటీనా ట్రోఫీని కైవసం చేసుకుంది. దీంతో మేజర్ టైటిల్‌తో కెరీర్ ముగించాలనుకున్న మెస్సీ ఆశ నెరవేరినట్లయింది.
అయితే, తమ జట్టు ఫైనల్ చేరిన సందర్భంగా అర్జెంటీనా తరపున చివరి మ్యాచ్ ఆడబోతున్నానని మెస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, తాజా వ్యాఖ్యలతో తాను మరికొంత కాలం ఆడతానని అతడు స్పష్టం చేశాడు.
ఈ మేరకు ఫైనల్లో గెలిచిన అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు కోసం నేను ఎంతగా ఎదురుచూశానో నాకే తెలుసు. ఆ దేవుడు ఏదో ఒకనాడు నాకు ఈ బహుమతి ఇస్తాడని కూడా తెలుసు. ఇక్కడిదాకా చేరుకోవడానికి చాలా కాలం పట్టింది.
మేమెంతగానో కష్టపడ్డాం. కఠిన శ్రమకోర్చాం. ఎట్టకేలకు సాధించాం. వరల్డ్ చాంపియన్‌గా మరిన్ని మ్యాచ్‌లు ఆడతా’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా ఇన్‌స్టా వేదికగా ఫొటోలు పంచుకుంటూ ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతూ మెస్సీ భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
చదవండి: Messi- Ronaldo: మెస్సీ సాధించాడు.. ఘనంగా ‘ముగింపు’! మరి రొనాల్డో సంగతి? ఆరోజు ‘అవమానకర’ రీతిలో..
Rohit Sharma: ‘సెంచరీ వీరుడు గిల్ బెంచ్‌కే పరిమితం! రెండో టెస్టులో ఓపెనర్లుగా వాళ్లిద్దరే!’