
ఫిఫా ప్రపంచకప్-2022 తుది సమరానికి మరో 48 గంటల్లో తేరలేవనుంది. ఖాతార్ వేదికగా ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే కీలకమైన ఫైనల్‌కు ముందు అర్జెంటీనాకు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఫ్రాన్స్‌తో ఫైనల్ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సెమీఫైనల్లో క్రొయేషియాతో మ్యాచ్ సందర్భంగా మెస్సీ తొడ కండరాల గాయంతో బాధపడినట్లు సమాచారం. ఈ క్రమంలో అతడు గురువారం జరిగిన తమ జట్టు ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
కాగా మెస్సీ మాత్రమే కాకుండా స్టార్ ఆటగాడు పాపు గోమెజ్ కూడా చీలమండ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ మ్యాచ్‌కు అతడి అందుబాటుపై కూడా సందిగ్ధం నెలకొంది. కాగా ఫ్రాన్స్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్ మెస్సీకి ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఫైనల్లో గెలిచి ఫిఫా వరల్డ్‌కప్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ముగించాలని భావిస్తున్నాడు.
చదవండి: Lionel Messi: మెస్సీతో ఇంటర్య్వూ; ఫిఫా ఫైనల్.. చివరి మ్యాచ్ అని తట్టుకోలేక
Comments
Please login to add a commentAdd a comment