
లండన్: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ బెన్ స్టోక్స్ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెం ట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ మెగా వేలంలో స్టోక్స్ తన పేరును నమోదు చేసుకోలేదు. ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్ లో ఐదు టెస్టులు ఆడిన స్టోక్స్ నిరాశ పరిచాడు. మొత్తం 236 పరుగులు చేసిన అతను నాలుగు వికెట్లే తీశాడు. స్వదేశంలో వచ్చే సీజన్ కోసం మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలనే లక్ష్యంతో స్టోక్స్ ఐపీఎల్‌లో ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడు. 2021 ఐపీఎల్ టోర్నీలో స్టోక్స్ రాజస్తాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. కాగా, స్టోక్స్‌కు ముందు ఇంగ్లండ్ టెస్ట్ సారధి జో రూట్ కూడా ఐపీఎల్ మెగా ఆక్షన్ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.