ఇంగ్లండ్ క్రికెటర్ అనూహ్య నిర్ణయం | England batsman James Taylor retires | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ క్రికెటర్ అనూహ్య నిర్ణయం

Published Tue, Apr 12 2016 4:14 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM

ఇంగ్లండ్ క్రికెటర్ అనూహ్య నిర్ణయం

ఇంగ్లండ్ క్రికెటర్ అనూహ్య నిర్ణయం

లండన్: ఇంగ్లండ్ బ్యాట్స్మన్ జేమ్స్ టేలర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్య కారణాల వల్లే జేమ్స్ (26) చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పాడు. ప్రమాదకర గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు వెల్లడించాడు. మంగళవారం జేమ్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు.

'నా జీవితంలో ఇది క్లిష్టమైన సమయం. నా ప్రపంచం తలకిందులైంది. జీవన్మరణ పోరాటం చేస్తున్నా' అంటూ జేమ్స్ ట్వీట్ చేశాడు. ఈ వార్త తెలియగానే ఇంగ్లండ్ టీమ్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధాకరమని వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ కెరీర్లో జేమ్స్ 7 టెస్టులు, 27 వన్డేలు ఆడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement