James Taylor
-
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
అరుదైన గుండె సమస్యతో బాధపడుతున్న ఇంగ్లండ్ కౌంటీ (గ్లోసెస్టర్‌షైర్) క్రికెటర్ బెన్ వెల్స్ 23 ఏళ్ల చిన్న వయసులోనే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.వెల్స్ అరుదైన అరిథ్మోజెనిక్ రైట్ వెంట్రిక్యులర్ కార్డియోమయోపతితో (ARVC) బాధపడుతున్నట్లు ఇటీవల జరిపిన హార్ట్ స్క్రీనింగ్ పరీక్షలో నిర్ధారణ అయ్యింది. ARVC సమస్యతో బాధపడుతున్న వారు శారీరక శ్రమకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. పరిగెత్తడం, వ్యాయామం చేయడం వంటివి చేయకూడదు.శారీరక శ్రమ లేకుండా క్రికెట్ ఆడటం అసాధ్యం కాబట్టి వెల్స్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆటకు గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. కెరీర్ అర్దంతరంగా ముగియడంతో వెల్స్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. క్రికెట్ పట్ల తనకున్న మక్కువను వ్యక్తపరుస్తూ ఓ లేఖను విడుదల చేశాడు. దీన్ని వెల్స్ కౌంటీ జట్టు గ్లోసెస్టర్‌షైర్ తమ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన వెల్స్.. 2021లో అరంగేట్రం చేసి స్వల్పకెరీర్‌లో ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 15 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 9 టీ20లు ఆడాడు. వెల్స్ ఇటీవలే లిస్ట్-ఏ ఫార్మాట్లో మెరుపు సెంచరీతో మెరిశాడు. లండన్ వన్డే కప్‌లో భాగంగా డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెల్స్ ఈ సెంచరీ చేశాడు. వెల్స్కు లిస్ట్-ఏ కెరీర్లో ఇది తొలి శతకం. కాగా, ఇంగ్లండ్ జాతీయ జట్టు ఆటగాడు జేమ్స్ టేలర్ కూడా వెల్స్ బాధపడుతున్న గుండె సమస్య కారణంగానే క్రికెట్‌కు అర్దంతరంగా వీడ్కోలు పలికాడు. -
జేమ్స్ టేలర్ అనూహ్య రిటైర్మెంట్
లండన్: ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ టేలర్ 26 ఏళ్ల చిన్న వయస్సులోనే తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తున్నట్టు ప్రకటించాడు. తీవ్రమైన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టేలర్ తెలిపాడు. అనారోగ్య కారణంగా ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్ నుంచి కూడా తప్పుకున్నాడు. సోమవారం స్కానింగ్‌లో అతడి గుండె చాలా తీవ్ర పరి స్థితిలో ఉన్నట్టు తేలింది. ఇంగ్లండ్ తరఫున ఏడు టెస్టులు ఆడిన టేలర్ 312 పరుగులు చేయగా, 27 వన్డేల్లో 887 పరుగులు సాధిం చాడు. ఇందులో ఓ శతకం ఉంది. -
ఇంగ్లండ్ క్రికెటర్ అనూహ్య నిర్ణయం
లండన్: ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జేమ్స్ టేలర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. అనారోగ్య కారణాల వల్లే జేమ్స్ (26) చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. ప్రమాదకర గుండె జబ్బుతో బాధపడుతున్నట్టు వెల్లడించాడు. మంగళవారం జేమ్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. 'నా జీవితంలో ఇది క్లిష్టమైన సమయం. నా ప్రపంచం తలకిందులైంది. జీవన్మరణ పోరాటం చేస్తున్నా' అంటూ జేమ్స్ ట్వీట్ చేశాడు. ఈ వార్త తెలియగానే ఇంగ్లండ్ టీమ్ డైరెక్టర్ ఆండ్రూ స్ట్రాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ఇది చాలా బాధాకరమని వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ కెరీర్లో జేమ్స్ 7 టెస్టులు, 27 వన్డేలు ఆడాడు. -
ఇంగ్లండ్ 179/4
► దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. దీంతో తొలి రోజు శనివారం ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 65.1 ఓవర్లలో నాలుగు వికెట్లకు 179 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను పేసర్ స్టెయిన్ (3/29) దెబ్బతీశాడు. కెప్టెన్ కుక్(0), రూట్ (24) విఫలమయ్యాడు. 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జేమ్స్ టేలర్ (70), కాంప్టన్ (63 బ్యాటింగ్) జట్టును నిలబెట్టారు. క్రీజులో కాంప్టన్తో స్టోక్స్ (5 బ్యాటింగ్) ఉన్నాడు. -
టేలర్ ఫస్ట్ సెంచరీ; ఇంగ్లండ్ విక్టరీ
మాంచెస్టర్: ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మూడో వన్డేలో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్ నెగ్గేందుకు ఆశలు సజీవంగా ఉంచుకుంది. జేమ్స్ టేలర్ తొలి వన్డే సెంచరీకి తోడు, స్పిన్నర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తోడడవడంతో ఇంగ్లీషు సేన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 300 పరుగులు చేసింది. టేలర్ సెంచరీ సాధించాడు. 114 బంతుల్లో 5 ఫోర్లతో 101 పరుగులు చేశాడు. రాయ్(63), మోర్గాన్(62) అర్ధసెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో మ్యాక్స్ వెల్, కుమిన్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. స్టార్క్, అగార్ ఒక్కో వికెట్ తీశారు. 301 పరుగుల టార్గెట్ ను చేరుకునేందుకు బరిలోకి దిగిన స్మిత్ సేన 44 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఫించ్(53), వేడ్(42) మినహా అందరూ విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్, అలీ మూడేసి వికెట్లు నేలకూల్చారు. ఫిన్, రషీద్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. జేమ్స్ టేలర్ 'మ్యాన్ ఆఫ్ మ్యాచ్' అందుకున్నాడు. ఐదు మ్యాచ్ ల ఈ సిరీస్ లో మొదటి రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా గెలిచింది.