
జేమ్స్ టేలర్ అనూహ్య రిటైర్మెంట్
లండన్: ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ టేలర్ 26 ఏళ్ల చిన్న వయస్సులోనే తన అంతర్జాతీయ కెరీర్‌ను ముగిస్తున్నట్టు ప్రకటించాడు. తీవ్రమైన హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టేలర్ తెలిపాడు. అనారోగ్య కారణంగా ప్రస్తుతం జరుగుతున్న కౌంటీ చాంపియన్‌షిప్ నుంచి కూడా తప్పుకున్నాడు. సోమవారం స్కానింగ్‌లో అతడి గుండె చాలా తీవ్ర పరి స్థితిలో ఉన్నట్టు తేలింది. ఇంగ్లండ్ తరఫున ఏడు టెస్టులు ఆడిన టేలర్ 312 పరుగులు చేయగా, 27 వన్డేల్లో 887 పరుగులు సాధిం చాడు. ఇందులో ఓ శతకం ఉంది.