లండన్ : ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ స్టోక్స్ బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న స్టోక్స్ తండ్రి మరణవార్తను తెలుసుకొని హుటాహుటిన న్యూజిలాండ్‌కు బయల్దేరాడు. కాగా స్టోక్స్‌కు తన తండ్రి గెరార్డ్ అంటే విపరీతమై ప్రేమ.. అతని కోరిక మేరకే క్రికెటర్ అయిన స్టోక్స్ ఇవాళ సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగాడు. గతేడాది డిసెంబర్‌లో తండ్రి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకున్న స్టోక్స్ గెరార్డ్‌కు సాయంగా ఉండేందుకు పాకిస్తాన్ పర్యటన నుంచి అర్థంతరంగా తప్పుకొని న్యూజిలాండ్‌కు చేరుకున్నాడు. గెరార్డ్ ఆరోగ్యం కాస్త కుదుటపడ్డ తర్వాత అతని అనుమతితో స్టోక్స్ యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లో ఆడాడు. తాజాగా 29 ఏళ్ల స్టోక్స్ గెరార్డ్ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి తండ్రితో ఉన్న అనుబంధాన్ని ఉద్వేగభరితంతో రాసుకొచ్చాడు. (చదవండి : బెన్ స్టోక్స్ ఇంట తీవ్ర విషాదం)
'నాన్న.. నువ్వు చనిపోయేటప్పుడు నేను నీ దగ్గర లేను.. క్రికెట్ పేరుతో ఇన్ని సంవత్సరాలు నీకు దూరంగా బతకాల్సి వచ్చింది. కానీ ఎక్కడ ఉన్నా బతికే ఉన్నావని ఆశతో.. నీ చిరునవ్వుతో మమ్మల్ని సంతోషంగా ఉంచేవాడివి. ఈ జీవితం ఇలా ఉందంటే నువ్వు ఇచ్చిన ప్రోత్సాహమే. ఈరోజు మా నుంచి దూరమైన.. నీ జ్ఞాపకాలు మాత్రం వెంటాడుతూనే ఉంటాయి. లవ్ యూ ఫర్ ఎవర్.. అంటూ ' ఎమోషనల్‌గా పేర్కొన్నాడు.
అంతేకాదు నాన్న పని పట్ల ఎంతో నిబద్ధతతో వ్యవహరించేవాడని, రగ్బీకి దూరమైన తర్వాత 'నాకు ఒక జాబ్ ఉందని.. నా భార్యను.. పిల్లలను చూసుకోవాల్సిన అవసరం ఉందని' మాతో ఎప్పుడూ చెప్పేవాడని స్టోక్స్ పేర్కొన్నాడు. స్టోక్స్ షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'రిప్.. గెరార్డ్ స్టోక్స్.. మీ ఇద్దరి అనుబంధం విడదీయలేనిది.. మీలాంటి వ్యక్తి స్టోక్స్‌కు తండ్రి కావడం అతను చేసుకున్న అదృష్టం' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి : 'క్రికెట్‌లో ఇలాంటి సూపర్‌స్టార్ చాలా అవసరం')
Comments
Please login to add a commentAdd a comment