
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. 2022 సీజన్‌కు గాను సస్సెక్స్ క్లబ్‌తో ఒప్పందం చేసుకున్నాడు. కౌంటీల్లో ఆడడం రిజ్వాన్‌కి ఇదే తొలిసారి. అతడు వచ్చే సీజన్‌లో టీ20 బ్లస్ట్‌తో పాటు, కౌంటీ క్రికెట్ కూడా ఆడనున్నాడు.ఇక ఈ విషయంపై స్పందించిన రిజ్వాన్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. "చరిత్రాత్మక సస్సెక్స్ క్లబ్‌లో భాగం కావడం చాలా గర్వంగా ఉంది. సస్సెక్స్ క్లబ్ గురించి నేను చాలా విషయాలు విన్నాను. అటువంటి క్రికెట్ క్లబ్‌లో ఆడటం నా ఆదృష్టంగా భావిస్తున్నాను" అని పేర్కొన్నాడు.
ఇక సస్సెక్స్ కోచ్ సాలిస్బరీ మాట్లాడుతూ.. టీ20, టెస్ట్‌ల్లో అతడు సాధించిన రికార్డులను ప్రశంసించాడు. "అతడి ఫస్ట్ క్లాస్ రికార్డులు, టెస్ట్ రికార్డులు అతడు ఏంటో తెలుపుతున్నాయి. అటువంటి స్టార్ క్రికెటర్ సస్సెక్స్ క్లబ్ తరుపున ఆడడం చాలా సంతోషం" అని పేర్కొన్నాడు. ఇక టీ20 క్రికెట్‌లో మహ్మద్ రిజ్వాన్ దుమ్ము రేపుతున్నాడు. ఒకే క్యాలండర్ ఇయర్‌లో టి20 క్రికెట్‌లో 2వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా మహ్మద్ రిజ్వాన్ రికార్డులకెక్కాడు.
చదవండి: Ind Vs Sa Test Series: కెప్టెన్‌గా కోహ్లికిదే చివరి అవకాశం.. కాబట్టి
Comments
Please login to add a commentAdd a comment