
టీమిండియా వెటరన్ ఓపెనర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ దేశవాళీ టోర్నీ‘రాయల్ లండన్ వన్డే కప్’లో సెంచరీల మోగిస్తున్నాడు. ఈ టోర్నీలో ససెక్స్ తరపున ఆడుతున్న పుజారా వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం(ఆగస్టు12) వార్విక్‌షైర్‌తో జరగిన మ్యాచ్‌లో మెరుపు శతకం (79 బంతుల్లో 107 పరుగులు) సాధించిన పుజారా.. ఆదివారం సర్రేతో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చేలరేగిపోయాడు.
ఈ మ్యాచ్‌లో కేవలం 131 బంతుల్లో 174 పరుగులు సాధించి ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 20 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన పుజారా నాలుగేళ్ల కుమార్తె అదితి మ్యాచ్‌ను తెగ ఎంజాయ్ చేసింది.
పుజారా 174 పరుగులు సాధించి ఔటైన తర్వాత డగౌట్‌కు తిరిగి వస్తుండగా ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ అతడిని అభినందించారు. ఇదే సమయంలో అదితి కూడా తన తండ్రిని అభినందిస్తూ డ్యాన్స్ చేస్తూ చప్పట్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను పుజారా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: Ms Dhoni: సరిగ్గా ఇదే రోజు.. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ గుడ్‌బై! ఐసీసీ స్పెషల్ వీడియో
Comments
Please login to add a commentAdd a comment