భారత టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురైన సీనియర్ ఆటగాడు ఛతేశ్వర్ పుజారా ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడనున్నాడు. ఇంగ్లండ్ కౌంటీ జట్టు ససెక్స్ జట్టకు పుజారా ప్రాతనిథ్యం వహించనున్నాడు. ఈ ఏడాది సీజన్‌కు దూరమైన ఆస్ట్ల్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ స్థానంలో పుజారాకు చోటు దక్కింది. పుజారా మొదటి కౌంటీ మ్యాచ్ నుంచి టోర్నమెంట్ ముగిసే వరకు ససెక్స్ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.
“రాబోయే సీజన్‌లో చారిత్రాత్మక సస్సెక్స్ కౌంటీ క్రికెట్ క్లబ్‌లో భాగమైనందుకు నేను సంతోషిస్తున్నాను. నేను త్వరలో సస్సెక్స్ జట్టుతో చేరేందుకు ఎదురు చూస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నాను. కానీ తొలి సారి సస్సెక్స్ ఆడడం సంతోషంగా ఉంది. అదే విధంగా క్లబ్ విజయానికి నావంతు కృషిచేస్తాను' అని ససెక్స్ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు.
ఇక గత కొంత కాలంగా టెస్టుల్లో పుజారా పేలవ ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. దీంతో స్వదేశంలో శ్రీలంకతో జరగుతున్న టెస్టులకు పుజారాతో పాటు, రహానేలపై బీసీసీఐ వేటు వేసింది. ఇక ఐపీఎల్ మెగా వేలంలో పాల్గొన్న పుజారాను కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. ప్రస్తుతం జరుగుతున్న రంజీట్రోఫీలో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న పుజారా 191 పరుగులు చేశాడు.
చదవండి: IPL 2022- RCB New Captain: అప్‌డేట్ ఇచ్చిన కోహ్లి.. వావ్ మళ్లీ భయ్యానే కెప్టెన్!
Comments
Please login to add a commentAdd a comment