చిన్నారి ఉసురు తీసిన దంపతుల తగాదా | Hyderabad Mother Poured Sanitizer On Child And Then Poured Herself On Fire | Sakshi
Sakshi News home page

చిన్నారి ఉసురు తీసిన దంపతుల తగాదా

Published Fri, Jan 21 2022 3:52 AM | Last Updated on Fri, Jan 21 2022 4:16 AM

Hyderabad Mother Poured Sanitizer On Child And Then Poured Herself On Fire - Sakshi

లింగోజిగూడ: భార్యాభర్తల మధ్య తగాదా ఏడు నెలల చిన్నారి ప్రాణం తీసింది. నల్లగొండ జిల్లా నాంపల్లికి చెందిన రాయత్‌ వెంకటేశ్, సువర్ణలకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. హయత్‌నగర్‌ బంజారా‡కాలనీకి వచ్చి స్థిరపడ్డారు. వెంకటేశ్‌ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి మొదట కవల పిల్లలు జన్మించగా అనంతరం కన్నయ్య (7 నెలలు) జన్మించాడు. వెంకటేశ్, సువర్ణల మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 11న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

గొడవ అనంతరం భర్త బయటకు వెళ్లగానే కన్నయ్యతోపాటు తనపై కూడా శానిటైజర్‌ పోసుకుని సువర్ణ నిప్పంటించుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సువర్ణను ఆసుపత్రికి తరలించారు. కన్నయ్యను నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించి.. అనంతరం పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కన్నయ్య గురువారం మృతిచెందగా సువర్ణ చికిత్స పొందుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement