పుణె: కంపెనీ పనిమీద ఢిల్లీ వెళ్లొచ్చిన ఓ ఉద్యోగి పై పుణెలోని ఓ కంపెనీ యజమాని అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంపెనీ సొమ్ము సొంతానికి వాడుకుని తిరిగి ఇవ్వడం లేదని కంపెనీ యజమాని ఉద్యోగిని కిడ్నాప్ చేసి ఇబ్బందులకు గురిచేశాడు. రెండు రోజులపాటు బంధించి వదిలేశాడు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వివరాలు.. పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేసే ఓ వ్యక్తి (30) సంస్థ పనిమీద మార్చిలో ఢిల్లీ వెళ్లాడు. లాక్‌డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన అతను మే 7న తిరిగి పుణెలోని సొంతూరు కొత్రూడ్ వచ్చాడు.
(చదవండి: కరోనా: ప్రపంచంలో మూడో స్థానంలో భారత్)
కరోనా నేపథ్యంలో అతన్ని 17 రోజులపాటు హోటల్‌లో ఉండాలని సంస్థ యజమాని చెప్పాడు. అయితే, క్వారంటైన్ పూర్తి చేసుకుని కంపెనీకి వచ్చిన అతనిపై యజమాని రెచ్చిపోయాడు. ఢిల్లీలో, తిరిగి వచ్చిన తర్వాత పుణెలో అతను ఖర్చు చేసిన మొత్తం డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చాడు. కంపెనీ పనిమీద వెళ్లిన తను డబ్బులు ఎలా ఇవ్వాలని మేనేజర్ అతన్ని ప్రశ్నించాడు. దీంతో మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి యజమాని మేనేజర్‌ను జూన్ 13న కిడ్నాప్ చేశాడు. రెండురోజులపాటు బంధించి.. ప్రైవేటు భాగాలపై శానిటైజర్ పూసి టార్చర్ చేశాడు. బాధితుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియాకు ఆదివారం కేసు వివరాలు వివరించారు.
(గాలి ద్వారా కరోనా సంక్రమణ)
Comments
Please login to add a commentAdd a comment