ప్రతీకాత్మక చిత్రం
ముంబై: శానిటైజర్ తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించడంతో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్గర్ జిల్లా తారాపూర్ పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం జరిగింది. ప్రమాదం జరిగిన శానిటైజర్, హ్యాండ్‌వాష్ తయారీ పరిశ్రమలో మొత్తం 66 మంది పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కెమికల్ ఫ్యాక్టరీలో తొలుత పొగలు వచ్చాయని, అంతలోనే భారీ శబ్దంతో పేలుడు సంభవించిందని వెల్లడించారు.
(చదవండి: లాక్‌డౌన్: రేపు ఉదయం 10 గంటలకు మోదీ ప్రసంగం)
కాగా, మహమ్మారి కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో.. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత తప్పనిసరి అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శానిటైజర్లు, హ్యాండ్‌వాష్‌లు, సబ్బులకు భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకనే నిత్యావసరాల్లో ఒకటిగా మారిపోయిన శానిటైజర్ల తయారీకి ప్రభుత్వం ఆయా కంపెనీలకు అనుమతులిచ్చింది. ఇక దేశవ్యాప్తంగా 9152 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1985 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
(చదవండి: బాలీవుడ్ సెలబ్రిటీల తీరుపై కొరియోగ్రాఫర్ మండిపాటు)
Comments
Please login to add a commentAdd a comment