
సాక్షి, హైదరాబాద్ : మియాపూర్‌లో శానిటేషన్ ద్రావణాన్ని తరలిస్తున్న ఓ లారీలో మంటలు వ్యాపించాయి. జీడిమెట్ల నుంచి సంగారెడ్డి వైపు వెళ్తుండగా మియాపూర్ బస్‌డిపో వద్దకు రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరగగానే లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. లారీలో ఒక్కొక్క క్యాన్‌లలో 20 లీటర్ల శానిటేషన్ ద్రావణం ఉన్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment