సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఎక్కడ చూసినా కరోనా హైరానే.. ఎవరిని పలకరించినా ఈ వైరస్ గురించి చర్చలే. దేశ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొదటిది చేతులు పరిశుభ్రంగా ఉండటం. సబ్బుతోనో.. హ్యాండ్‌వాష్‌ను ఉపయోగించడం కన్నా శానిటైజర్‌ను వాడటం సులభం, ఉత్తమమని ప్రచారం జరగడంతో దీనికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. వ్యాపారుల బ్లాక్ మార్కెట్ పుణ్యమా అని ఎక్కడ కూడా హ్యాండ్ శానిటైజర్ దొరకని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆన్‌లైన్, ఆఫ్ లైన్, మెడికల్ షాప్స్ ఇలా ఎక్కడ కూడా నోస్టాక్ అంటూ చెప్పేస్తున్నారు. ఈ దశలో అత్యధిక రేటు ఉండే హ్యాండ్ శానిటైజర్‌లు సులభంగా ఇంటిలోనే ఎలా తయారు చేసుకోవాలి? దీనికి కావాల్సిన వస్తువులు ఎక్కడ దొరుకుతాయి తదితర అంశాలపై పూర్తి వివరాలు ఇవీ.. (168కి చేరిన కరోనా కేసులు)
శానిటైజర్ తయారీకి కావాల్సినవి..
రబ్బింగ్ ఆల్కహాల్: ఇది నాన్‌సెప్టిక్ ద్రావకం. దీన్ని ఐసోప్రోప్లీ ఆల్కహాల్, ఇథేల్ ఆల్కహాల్, ఇథనాల్ అని కూడా పిలుస్తారు. ఇది ఫంగస్, వైరస్‌లకు చంపేస్తుంది. మెడికల్ షాప్స్, మెడికల్ ఏజెన్సీలు లేదా మెడికల్ రసాయనాలు అమ్మే షాపులలో ఇది దొరుకుతుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ స్టోర్లలో కూడా బ్రాండ్‌ను బట్టి 100 ఎంఎల్ రూ.100 నుంచి రెండు లీటర్‌లు, 5 లీటర్ల క్వాంటిటీలో రూ. 495 ఆపై ధరల్లో లభిస్తుంది.
అలోవెరా జెల్: కిరాణా, ఆయుర్వేద షాపుల్లో ఇది సులభంగా దొరుకుతుంది. ఇంటిలో అలోవెరా మొక్క ఉంటే దాని నుంచి కూడా సేకరించవచ్చు. యాంటిబయోటెక్‌గా, చర్మ రక్షనకు ఇది ఉపకరిస్తుంది.
ఎసెన్షియల్ ఆయిల్: అదనపు క్రిమినాశక లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. వివిధ రకాల ఫ్లేవర్లలో ఇది తక్కువ ధరకే దొరుకుతుంది. ప్లాంట్స్ నుంచి సేకరించే ఎసెన్సియల్ ఆయిల్ కాస్మొటిక్స్, పర్‌ఫ్యూమ్స్, పలురకాల ఫుడ్ ప్రొడక్ట్‌ల్లోనూ దీన్ని ఉపయోగిస్తారు.
తయారీ ఇలా: 100 శాతం ఆల్కహాల్ ద్రావకం ఉంటే 140 ఎంల్ ఆల్కహాల్ తీసుకోవాలి. దీనిలో 60 ఎంల్ మినరల్ వాటర్ మిక్స్ చేయాలి. ఇందులో 100 ఎంఎల్ అలోవెరా జెల్ వేసి 8 నుంచి 15 చుక్కలు వేసి మిక్స్ చేయాలి. అంతా పూర్తిగా మిక్స్ అయిన తర్వాత 300 ఎంఎల్ శానిటైజర్‌ను హ్యాండ్ పంప్ బాటిల్‌లో వేసుకుని శానిటైజర్‌గా వాడుకోవచ్చు.
గమనిక: వంద శాతం మిక్స్ ఉన్న ఆల్కహాల్ ద్రావకంలో 30 నుంచి 40 వరకు మినరల్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. రబ్బింగ్ ఆల్కహాల్ దొరక్కపోతే ఓడ్కా లిక్కర్‌ను ఉపయోగించుకోవచ్చు. బాదం ఆయిల్, బాడీ ఆయిల్‌ను కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభించే అలోవెరా జెల్‌ను ఉపయోగిస్తే ఎసెన్షియల్ ఆయిల్ అవసరం ఉండదు. ఒకవేళ ఉపయోగించినా నష్టంలేదు.
శానిటైజర్ తయారీకి కావాల్సినవి..
Published Thu, Mar 19 2020 2:03 PM | Last Updated on Thu, Mar 19 2020 3:40 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment