సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి గడగడలాడిస్తోన్న నేపథ్యంలో దేశంలో కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్రాలు కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బహిరంగా ప్రదేశాల్లో రోడ్లపైకి వచ్చే వాహనాలను సురక్షితంగా ఉంచేందుకు శానిటైజేషన్ టనెల్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ టన్నెల్‌లో సోడియం హైపోక్లోరైట్ ద్రవణాన్ని ఉపయోగించి శానిటైజేషన్ నిర్వహిస్తున్నారు. అయితే సోడియం హైపోక్లోరైట్ ద్రవణం మనిషి కళ్లకు, చర్మానికి హానీ కలిగిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. దీంతో దేశంలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన డిస్‌ఇన్‌ఫెక్షన్ టనెల్స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. (13వేలకు చేరిన కరోనా పాజిటివ్ కేసులు)
ఇదే విషయమై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ.. సోడియం హైపోకోల్రైట్ ద్రవణం అనేది ఉపరితలంతో పాటు కంటికి కనిపించని సూక్ష్మ పదార్థాలపై మాత్రమే పని చేస్తుందని తెలిపింది. అంతేగాక సోడియం హైపోక్లోరైట్‌లో ఉపయోగించే ఆల్కాహాల్, క్లోరిన్ పదార్థాలు అప్పటికే మానవ శరీరంలోకి చొచ్చుకుపోయిన వైరస్‌ను పూర్తిగా నశింపజేయలేదు. అంతేగాక ఇది కళ్లలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ వంటి సున్నితమై పొరతో పాటు నోటికి హాని కలిగించే అవకాశం ఉంది. సోడియం హైపో క్లోరైట్ ద్రవణం కేవలం ఉపరితలం మీద ఉండే వైరస్‌ను కొంతవరకు తొలగిస్తుందని పేర్కొంది. అయితే ఈ ద్రవణాన్ని తక్కువ పరిమితిలో వాడితే హాని కలిగించే అవకాశం తక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే ఉపరితలం మీద కేవలం 0.5 శాతం( 5వేల పీపీఎమ్) సోడియం కోల్రైట్ ద్రవణం ఉపయోగించాలని తెలిపింది. అయితే డబ్ల్యుహెచ్‌వో సూచనలు పాటించకుండా బహిరంగ ప్రదేశాల్లో వెహికల్ టనెల్స్ ఏర్పాటు చేసి ఎక్కువ మోతాదులో ద్రవణం ఉపయోగిస్తుండడంతో ప్రమాదం పొంచి ఉంది.
దీంతో దేశంలోని బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన వెహికల్ టనెల్స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అన్ని రాష్ట్రాల వైద్యశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. తమిళనాడు వైద్య ఆరోగ్య, మెడికల్ డైరెక్టర్ కె. కోలందాస్వామి మాట్లాడుతూ..రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వెహికల్ టనెల్స్‌ను ఉపయోగించకూడదని డిప్యూటీ డైరెక్టర్‌తో పాటు మిగతా సిబ్బందికి తెలిపినట్లు ప్రకటించారు. దీనిపై సమీక్ష నిర్వహించామని.. ఒకవేళ ఉపయోగించినా తక్కువ మోతాదులో ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 13వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య 437కు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment