
సాక్షి, ఒంగోలు: స్థానిక పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న అబ్దుల్ రజాక్ మంచినీరు స్థానే శానిటైజర్ తాగి అస్వస్థతకు గురయ్యారు. స్థానిక కర్నూల్ రోడ్డులోని శ్రీనివాస కాలనీలో నివాసం ఉండే రజాక్ శానిటైజర్ తాగిన వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రోజూ నిద్రలేచిన వెంటనే మంచినీరు తాగడం రజాక్‌కు అలవాటు. ఆ క్రమంలోనే ఆయన శానిటైజర్ కలిసిన నీరు తాగినట్లు ఆలస్యంగా గుర్తించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రజాక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తాలూకా సీఐ శివరామకృష్ణారెడ్డి తెలిపారు. (శానిటైజర్ కొంటలేరు...)
Comments
Please login to add a commentAdd a comment