
సాక్షి, ప్రకాశం: కురిచేడులో శానిటైజర్ తాగిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య పదికి చేరింది. నిన్న అర్ధరాత్రి ముగ్గురు మరణించగా, శుక్రవారం మరో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు భిక్షాటన చేసే వ్యక్తులు కాగా, మరో ఆరుగురు గ్రామస్తులు ఉన్నారు. అనుగొండ శ్రీను బోయ(25), భోగేమ్ తిరుపతయ్య (37), గుంటక రామిరెడ్డి (60), కడియం రమణయ్య (30), కొనగిరి రమణయ్య (65), రాజారెడ్డి (65), బాబు (40), ఛార్లెస్ (45), అగస్టీన్ (47) మృతి చెందారు.మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం చనిపోయారు.
కరోనా దృష్ట్యా కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దుకాణాలు లేకపోవటంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్ తాగారు. మద్యం దొరకక కొంతకాలంగా వీరు శానిటైజర్ తాగుతున్నట్లు సమాచారం. మృతదేహాలను దర్శి మార్చురీకి తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment