అంతా చేసి అమాయకుడిలా ఆ ఫేసు చూడు | Man Stoles Sanitiser And Returned It After Getting Caught On Camera | Sakshi
Sakshi News home page

కాస్త వెనకా ముందు చూసుకో బాసు!

Published Sun, Aug 16 2020 5:27 PM | Last Updated on Sun, Aug 16 2020 6:10 PM

Man Stoles Sanitiser And Returned It After Getting Caught On Camera - Sakshi

వీడియో దృశ్యాలు

తిరువనంతపురం : కరోనా వైరస్‌ భయంతో శానిటైజర్‌ మనిషి జీవితంలో ఓ నిత్యావసరంగా మారిపోయింది. డబ్బు పెట్టి శానిటైజర్‌ కొనుక్కునే వారి సంగతి పక్కన పెడితే.. కొనుక్కోలేని వాళ్లు అది ఫ్రీగా అందుబాటులో ఉండే షాపుల దగ్గరకో సెలూన్ల దగ్గరకో వెళ్లి పని జరుపుకుంటున్నారు. మరి కొంతమంది మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వాటిని దొంగిలించటమే పనిగా పెట్టుకుంటున్నారు. టైం బాగోలేక కొంతమంది సీసీ కెమెరాలకు దొరికిపోతున్నారు కూడా. అలాంటిదే ఈ వీడియో. కొద్దిరోజుల క్రితం కేరళకు చెందిన ఓ వ్యక్తి ఓ షాపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ చిన్న బాటిల్‌లో ఉన్న శానిటైజర్‌ను గుట్టుచప్పుడు కాకుండా తన వెంట తెచ్చుకున్న బాటిల్‌లో నింపుకున్నాడు. ( నిన్ను చూస్తుంటే కడుపు మండుతోంది)

తీరా అక్కడినుంచి వెళ్లిపోయే సమయంలో తాను చేసిన ఘన కార్యం సీసీ కెమెరాల్లో రికార్డయిందని తెలిసి కంగుతిన్నాడు. ఆ వెంటనే శానిటైజర్‌ను తీసిన బాటిల్‌లో నింపేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌లో పోస్టయిన ఈ వీడియోకు 5 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ కాస్త వెనకా ముందు చూసుకో బాసు!.. అంతా చేసి! అమాయకుడిలా ఆ ఫేసు చూడు.. కరోనా సమయంలో శానిటైజర్‌ దాత సుఖీభవ అనుకోవాలి అందరూ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement