
తిరువనంతపురం: ఓ వ్యక్తికి తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. అప్పటి దాకా బాగానే ఉన్న ఆ వ్యక్తి ఉన్నట్టుండి భవనంపై నుంచి కింద పడబోయాడు. అతడి పక్కనే మరో వ్యక్తి అది గమనించిన అతడి కాపాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో జరిగిన ఈ సంఘటన అక్కడి సీసీ కెమోరాలో రికార్టు అయ్యింది. ఈ వీడియోను దివ్వ అర్జున్ అనే ట్విటర్ యూజర్ శుక్రవారం షేర్ చేయడంతో వెలుగులోకి వచ్చింది.
1:35 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో కేరళలోని ఓ ప్రభుత్వం కార్యాలయం ముందు కొంతమంది క్యూలో నిలుచుని ఉన్నారు. అయితే ఆ ఆఫీసు ఓ అపార్టుమెంటులోని మొదటి అంతస్తులో ఉంది. ఈ నేపథ్యంలో పని మీద అక్కడికి రెడ్ షర్ట్ ధరించిన వ్యక్తితో పాటు మరికొందరూ వచ్చారు. వారంత ఆఫీసు బయట పిట్ట గోడ వద్ద నిలుచుని ఉన్నారు. ఈ క్రమంలో కొద్ది సమయానికి అకస్మాత్తుగా ఆ వ్యక్తి కళ్లు తిరగడంతో ఉన్నచోటనే వెనక్కి వెల్లకిల ఆ పిట్ట గోడపై నుంచి కిందకు పడబోయాడు.
పక్కనే ఉన్న మరో వ్యక్తి అప్రమత్తమై అతడు పడిపోకుండా పట్టుకున్నాడు. అది చూసిన ఆఫీసు సిబ్బంది హుటాహుటిన బయటకు పరుగెత్తుకుంటు వచ్చి అతడికి సాయం చేశారు. చివరకు ఎలాగోలా ఆ వ్యక్తిని పైకి లాగి రక్షించారు. ఇది చూసిన నెటిజన్లు ‘ఓ మై గాడ్ ఎంత ప్రమాదం తప్పంది’, ‘పక్కనే ఉన్న వ్యక్తి అప్రమత్తం కాకపోయింటే ఘోరం జరిగిపోయేది’ అంటు కొంతమంది నెటిజన్లు కామెంట్ చేయగా మరికొందరు బ్లూ షర్ట్ ధరించిన వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment