ఆర్థికసాయం చేస్తున్న జెడ్పీటీసీ శ్యాం
సాక్షి, ఇల్లందకుంట(హుజూరాబాద్): కరోనా భయం ఓ వ్యక్తి ప్రాణాల మీదికి తెచ్చింది. ఎక్కడ కరోనా వస్తుందోనని చికెన్‌కు శానిటైజ్ చేసి తినడం ప్రాణాపాయ స్థితికి చేర్చింది. వివరాలిలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపక్కపల్లి గ్రామానికి చెందిన దినసరి కూలీ యాకుబ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆగస్టు మొదటి వారంలో ఇంటికి చికెన్ తీసుకొచ్చాడు. కరోనా భయంతో చికెన్ వండిన తర్వాత చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్‌ను అందులో కలిపాడు. వాసన రావడంతో భార్యాపిల్లలు తినలేదు. ఒక్కడే తినడంతో కొద్దిసేపటి తర్వాత వాంతులయ్యాయి. దీంతో మొదటి వారంలోనే వరంగల్ ఎంజీఎంకు వెళ్లాడు.
పేగులు గాయపడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుండగా కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారనే భయంతో ఆగస్టు 29న ఆస్పత్రి వైద్యులకు సమాచారం ఇవ్వకుండానే స్వగ్రామానికి చే రాడు. చికిత్సకు డబ్బులు లేకపోవడం, కాళ్లూ చేతులు పనిచేయకపోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. పరిస్థితి విషమించినట్లు తెలియడంతో జెడ్పీటీసీ శ్రీరాం శ్యామ్ తన వంతు ఆర్థికసాయం అందజేశారు. మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి తగిన వైద్యసాయం చేస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు. సర్పంచ్ మహేందర్, నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment