రెండు నెలల క్రితం మాస్క్, శానిటైజర్ అంటే తెలియని వారు సైతం.. ప్రస్తుతం అవి లేకుండా ఇళ్లలోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి.ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు నిత్యం జాగ్రత్తలు తప్పనిసరిగా మారింది. కరోనాను అడ్డుకునేందుకుఏకమైన మార్గం ఫిజికల్ డిస్టెన్స్ – హ్యాండ్ శానిటైజేషన్ మాత్రమే. ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు తెలియకుండానే మన చేతులతో వస్తువులనుతాకుతుంటాం. అతి ముఖ్యమైన జాగ్రత్తల్లో మనం చెప్పుకుంటున్న హ్యాండ్ శానిటైజర్ల వినియోగం సందర్భంలోనే మన చేతులతో హ్యాండ్ శానిటైజర్ పంపును తాకడమో లేక మరోవ్యక్తి దాన్ని చేతులకు అందించే క్రమంలోమన దగ్గరకు రావడమో జరుగుతోంది. కొన్నిచోట్ల లెగ్ ప్రెషర్ డిస్పెన్సర్ ఉన్నా అవి కొన్ని ప్రెస్‌ల తర్వాత పనిచేయకపోవడంతో చేతికి పనిచెప్పాల్సి వస్తోంది. ఇలాంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నగరానికి చెందిన ఓ యువ ఇంజినీర్ ఇప్పటి వరకు మార్కెట్‌లో అందుబాటులోలేని పూర్తి ఆటోమేటెడ్ శానిటైజేషన్ డిస్పెన్సర్‌ను రూపొందించాడు.
కుత్బుల్లాపూర్ :మన చేతులతో ఏమాత్రం తాకకుండా డిస్పెన్సర్‌కు దగ్గరగా చేతులను తీసుకెళ్లినప్పుడు ఆటోమెటిక్‌గా 4 ఎంఎల్ హ్యాండ్ శానిటైజర్ చేతుల్లో పడటమే దీని ప్రత్యేకత.
ఇందులో జెల్ బేస్డ్ శానిటైజర్‌తో పాటు లిక్విడ్ బేస్డ్ శానిటైజర్‌ను కూడా ఉపయోగించవచ్చు. పది లీటర్ల కెపాసిటీ కలిగిన ఈ డిస్పెన్సరీని ఒక్కసారి ఫిల్ చేస్తే దాదాపు రెండు వేలసార్లు లిక్విడ్‌ను పొందవచ్చు. విద్యుత్ సహాయంతో పనిచేసే ఈ ఉపకరణానికి నెలకు ఒక యూనిట్ విద్యుత్ మాత్రమే ఖర్చు కావడం విశేషం. ఉమ్మడి కుటుంబాలు, అధిక సంఖ్యలో సిబ్బంది ఉండే కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, పలుచోట్ల దీన్ని ఉపయోగించవచ్చు.
ఆలోచన వచ్చింది ఇలా..
నగరంలోని సాగర్‌రోడ్డు గుర్రంగూడకు చెందిన మెకానికల్ ఇంజినీర్ రాయంచి అభినవ్ కుమార్ లాక్‌డౌన్ సందర్భంలో ఓసారి బ్యాంక్‌కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి వచ్చిన వారికి బ్యాంక్ సిబ్బంది హ్యాండ్ శానిటైజర్ వేస్తూ కనిపించారు. ఈ సందర్భంలో సంబంధిత వ్యక్తులు దగ్గరగా రావడం, ప్రత్యేకంగా శానిటైజర్‌ను అందించేందుకు ఏకంగా ఓ వ్యక్తిని కేటాయించడం గమనించి ఆటోమేటెడ్ డిస్పెన్సరీని రూపొందించే ఆలోచనకు కార్యరూపం దాల్చాడు. తొలుత ఇంట్లో ఉన్న పాత ఆయిల్ క్యాన్‌తో ఈ ప్రయోగం మొదలు పెట్టారు అభినవ్ కుమార్. పలుమార్లు చేసిన ప్రయత్నాల్లో పలు రకాల నీటి పంప్‌లను, సబ్‌మెర్సిబుల్ పంప్‌లను వినియోగించి విఫలమయ్యాడు. చివరకు ఫుడ్‌గ్రేడ్ డీసీ పంప్, ఇండస్ట్రీయల్ గ్రేడ్ సెన్సార్, ఇతర పరికరాలతో విజయవంతంగా రూపొందించాడు.
25 రోజులు.. వేలమార్లు ప్రయోగం..
ఈ పరికరంలో ప్రధానమైన హార్డ్‌వేర్ డిజైన్‌ను రూపొందించేందుకు 25 రోజుల సమయం పట్టింది. అనంతరం రోబొటెక్ సహాయంతో సెన్సార్, మోటార్లను వేలమార్లు పరీక్షించి చూశాను. ఇప్పటి వరకు మార్కెట్ రకాల డిస్పెన్సరీలు రూ.8 నుంచి రూ.18 వేల వరకు ధర ఉన్నప్పటికీ అవి కేవలం లిక్విడ్ బేస్డ్ డిస్పెన్సరీలు మాత్రమే. వినాగో ఇన్నోవేషన్ బ్రాండ్ పేరిట ‘శాని–సెన్స్’ పేరుతో ఈ కాంటాక్ట్ లెస్ హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సరీని కేవలం రూ.6 వేలకు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. త్వరలో ఇండిపెండెంట్ ఇళ్లకు స్మాల్ డిస్ ఇన్‌స్పెన్షన్ టెన్నల్‌ను రూపొందించే ప్రయత్నం చేస్తున్నాం. – రాయంచి అభినవ్ కుమార్, శాని–సెన్స్‌కాంటాక్ట్ లెస్‌హ్యాండ్ శానిటైజర్ డిస్పెన్సరీ రూపకర్త
Comments
Please login to add a commentAdd a comment