న్యూఢిల్లీ: అన్‌లాక్ 4.0లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మెట్రో ప్రయాణానికి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్ (ఎస్‌ఓపీ)ని విడుదల చేసింది. 15 మెట్రో రైల్ కార్పొరేషన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో కేంద్రం మంగళవారం చర్చించిన అనంతరం ఎస్‌ఓపీని నిర్ణయించింది. దాని ప్రకారం మెట్రో సేవలను తొలుత గ్రేడెడ్ పద్దతిలో ప్రారంభిస్తారు. సెప్టెంబర్ ఏడు నుంచి ఒకటి కంటే ఎక్కువ లైన్లలో సేవలు అందుబాటులోకి వస్తాయి. సెప్టెంబరు 12 నాటికి అన్ని కారిడార్లు పని చేస్తాయి. ఇక కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కంటైన్‌మెంట్ జోన్లలో అన్ని స్టేషన్లు మూసివేసే ఉంటాయి. ఇక ప్రయాణికులు, సిబ్బంది తప్పక మాస్క్ ధరించాలి. సామాజిక దూరం తప్పనిసరి. మాస్క్ లేకుండా వచ్చేవారి వద్ద నుంచి డబ్బు వసూలు చేసి.. మాస్క్ ఇస్తారు. (చదవండి: సిటీ బస్సులు లేనట్టేనా?)
ఇక స్టేషన్‌లోకి ప్రవేశించేటప్పుడు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. కోవిడ్ లక్షణాలు లేనివారినే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. అనుమానితులను సమీప కోవిడ్ కేర్ సెంటర్‌కి పంపిస్తారు. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ప్రయాణికులు ఉపయోగం కోసం స్టేషన్ ఎంట్రీ వద్ద శానిటైజర్ ఉంచనున్నారు. నగదు రహిత లావాదేవీల కోసం స్మార్ట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సాహించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment