ముంబై : తనను మోసం చేసి రూ.10వేలు ఎత్తుకెళ్లిన దొంగను 17 రోజలుగా మాటువేసి పట్టుకుని పోలీసులకు అప్పగించారు ముంబైకి చెందిన ఓ మహిళ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గత ఏడాది డిసెంబర్ 18న ముంబైకి చెందిన రెహనా షేక్ తన ఆఫీస్ దగ్గర్లో ఉన్న ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు వెళ్లారు. తన ఏటీఎం కార్డుతో రూ.10వేలు డ్రా చేశారు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఆ డబ్బులు ఏటీఎం యంత్రం నుంచి బయటకు రాలేదు. ఇదంతా గమనించిన భూపేంద్ర మిశ్రా అనే వ్యక్తి ఆమె దగ్గరకు వచ్చాడు. తాను ఒక్కసారి చూస్తానని చెప్పి ఆమె ఏటీఎం వివరాలు అడిగి తెలుసుకున్నాడు.
నిందితుడు భూపేంద్ర మిశ్రా
తాను ట్రై చేసిన డబ్బులు రావడంలేదని చెప్పి ఆమెకు కార్డు ఇచ్చి వెళ్లాడు. ఆమె కూడా టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల డబ్బులు రాలేదనుకొని ఆఫీస్‌కు వెళ్లింది. కాసేపటి తర్వాత ఆమె ఫోన్‌కు రూ.10 వేలు డ్రా తీసినట్లు మెసేజ్ వచ్చింది. అంతే అక్కడి వెళ్లి చూస్తే ఆ వ్యక్తి కనబడలేదు. ఏటీఎం వచ్చిన డబ్బులు భూపేంద్ర మిశ్రా తీసుకొని అక్కడి నుంచి హుటాయించాడు.
విషయం తెలుసుకున్న రెహనా స్థానికి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రతి రోజు ఆ ఏటీఎం దగ్గరుకు వెళ్లి చుట్టు పక్కల వెతికారు. అలా 17 రోజులుగా ఆ ఏటీఎం దగ్గర మాటు వేసి చివరకు ఆ మోసగాన్ని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. భూపేంద్ర మిశ్రాపై ఇప్పటికే నాలుగు చీటింగ్ కేసులున్నాయని, ఆ పదివేల రూపాయలను కూడా మిశ్రానే దొంగిలించారని పోలీసులు తెలిపారు. నిందితునిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు.
Published Thu, Jan 10 2019 5:51 PM | Last Updated on Thu, Jan 10 2019 5:56 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment